- డిండికి ఏదుల నుంచి నీళ్లు తేవడం అంత సులువు కాదు..
- ఏదులకే 2 టీఎంసీల నీళ్లు వచ్చే పరిస్థితి లేదు..
- ఎల్లూరు పంపుహౌస్ డిజైన్ మార్పుతో పాలమూరుకు నష్టం చేశారు..
- కాళేశ్వరం అడిషనల్ టీఎంసీతో బస్వాపూర్ మీదుగా డిండి..
- ఎత్తిపోతలకు నీళ్లు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం..
- నల్గొండకు నీళ్లు తేవటం చేతకాక అధికార పార్టీ నేతలు రెండు..
- జిల్లాల మధ్య పంచాయితీ పెడుతున్నారు..
- ఈ ముఖ్యమంత్రిని రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిపోయాడు..
- ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ నాన్ పర్ ఫార్మింగ్ అసెట్ గా మిగిలిపోయింది..
- ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పరిష్కారాలు చూపుతోంది టీఆర్ఎస్ మాత్రమే..
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత..(Kalvakuntla Kavitha)
- డిండి రిజర్వాయర్ వద్ద ప్రజెంటేషన్..
రాష్ట్రంలో 80 శాతం పూర్తైన ప్రాజెక్ట్ లు కట్టకుండా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారు.. గతంలో రెండు కండ్ల సిద్దాంతం పార్టీలో ఉన్న ఆయన ఇప్పుడు మహబూబ్ నగర్, నల్గొండ రెండు కండ్లు అని చెబుతున్నారు.. కానీ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లను పెండింగ్ పెట్టి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల మధ్య పంచాయితీ పెడుతున్నాడు


కృష్ణానీళ్ల వినియోగానికి సంబంధించి ఎదుల నుంచి డిండి కి నీళ్లు తెస్తామని చెబుతున్నారు.. ఏదుల నుంచి డిండి కి నీళ్లు తేవడం అంత సులువు కాదు.. అసలు శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే 2 టీఎంసీల నీళ్లు తీసుకోలేము.. ఎల్లూరు పంపుహౌస్ ను ఓపెన్ కట్ నుంచి అండర్ గ్రౌండ్ గా మార్చడంతోనే సమస్య వచ్చింది.. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే లెవల్ 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెరిగింది.. అప్రోచ్ చానల్ 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయింది..
ఎల్లూరు పంపుహౌస్ కోసం చేపట్టిన బ్లాస్టింగ్స్ తో కల్వకుర్తి పంపు హౌస్ లో ఒక పంపు పేలిపోయింది.. ఏళ్లు గడిచినా దాన్ని రీస్టోర్ చేయలేదు.. మళ్ళీ ఇప్పుడు 0.6 టీఎంసీల కోసం ఇంకో సోర్స్ కోసం పంపు హౌస్ తవ్వితే కల్వకుర్తి, పాలమూరు పంపు హౌస్ లకు ప్రమాదం తప్పదు.. ఇన్ని అడ్డంకుల మధ్య ఏదుల నుంచి డిండి కి లింక్ చేస్తామనడం రెండు జిల్లాల ప్రజల మధ్య తగువులు పెట్టించడమే.. డిండి కి నీళ్లు తేవాలన్న కూడా స్పష్టమైన సోర్స్ పాయింట్ ఉండాలి.. కానీ దానిపై ఎలాంటి సర్వే లేకుండానే ముఖ్యమంత్రి ఎదుల నుంచి సోర్స్ పాయింట్ అని చెబుతున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సార్లు సర్వే చేసి సోర్స్ పాయింట్ ను చెప్పలేకపోయింది..

మనకున్న గోదావరి, కృష్ణా నదుల్లో నీటిని పుష్కలంగా వాడుకోవాలంటే ఆ రెండు నదులను అనుసంధానం చేయాలి.. ఈ విషయాన్ని అప్పట్లోనే పీవీ నర్సింహారావు గుర్తించి చెప్పారు.. ఎస్ఆర్ఎస్పీ ద్వారా నల్కొండ వరకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా కెనాల్స్ కూడా ఏర్పాటు చేశారు.. గోదావరి నది ద్వారా పూర్తిగా సిద్ధంగా ఉన్న వ్యవస్థను వాడుకోకుండా కృష్ణా నీళ్లను దిండికి తెస్తామని చెబుతున్నారు.. ఎదుల నుంచి దిండికి నీళ్లు ఇస్తూ ఉల్పర వరకు తెస్తామంటున్నారు.. కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఉల్పర నుంచి మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆంధ్రావాళ్లు మన నీళ్లను ఎత్తుకెళ్తున్నారు.. వాళ్ల రాష్ట్రం కోసం వాళ్లు చేసేది తప్పు కాదు.. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మనం పూర్తిస్థాయిలో ప్రాజెక్ట్ లు కట్టుకోలేదు..
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డికి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొస్తామన్నారు.. అది సరికాదు. ఆ ప్రతిపాదనే తప్పు అని టీఆర్ఎస్ పార్టీగా చెబుతున్నాం.. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ సర్వే, జీవో లేకుండా ఎదుల నుంచి నీళ్లు తెస్తామంటున్నారు.. అసలు కృష్ణానదిలో నీళ్లే లేవు. ఇప్పుడు అక్కడ నుంచి నీళ్లు తీసుకుంటామంటూ మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు పంచాయితీ పెడుతున్నారు.. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకోకపోవటమే తప్పు.. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల్లో నేను భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ చెబుతున్నా.. ఎదుల నుంచి నీళ్లు తేవటం సాధ్యం కాదని ఈ జిల్లాకు చెందిన నీటి పారుదల మంత్రికి కూడా తెలుసు.. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న సరే దిండి ఎత్తిపోతలకు సోర్స్ పాయింట్ చూపించలేదు..


కానీ ఇప్పుడు సోయి వచ్చి ఎదుల నుంచి నీళ్లు తెస్తామంటున్నారు.. ఎదుల నుంచి నీళ్లు తీసుకెళ్తే మా భూమి పోతుందని చాలా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ఐతే కేవలం ప్రభుత్వం పోరాటం కాకుండా సమస్యకు పరిష్కారం కూడా మేమే చూపించే ప్రయత్నం చేస్తున్నాం.. కొన్ని పార్టీలు రారు, చూడరు, ఏమీ చేయరు.. కానీ మేము పోరాటం చేస్తూ పరిష్కారం కూడా చూపిస్తాం. అదే మా విధానం.. పాలమూరు – రంగారెడ్డి విషయంలో కూడా మేము ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు చూపిస్తున్నాం.. నిజంగానే ఎదుల నుంచి ఉల్పరకు ఈ ప్రభుత్వం నీళ్లు తేవాలంటే ఇప్పటి వరకు సెంట్ భూమి కూడా తీసుకోలేదు.. ఈ కాంగ్రెస్ ఉండేది ఇంకా రెండేళ్లే. ఈ రెండేళ్లలో సర్వే పూర్తై ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఎప్పుడు? అది అయ్యేది లేదు, సచ్చేదీ లేదు. కేవలం టైమ్ పాస్ చేస్తూ రెండు జిల్లాలకు పంచాయితీ పెడుతున్నారు..
ఇప్పటికే నార్లపూర్ లో 9 పంపులు ఉంటే రెండే పనిచేస్తున్నాయి.. నీటిని ఎత్తేందుకు చేసిన ప్రయత్నం కల్వకుర్తి లో ఒక పంప్ పేలిపోయింది.. కల్వకుర్తిలో మోటారు పేలిపోయిన చోట తవ్వితే కల్వకుర్తి, నార్లపూర్ కూడా పోయే పరిస్థితి ఉంటుంది.. అక్కడ నుంచి అదనంగా 0.6 టీఎంసీల నీళ్లు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబుతూ మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల మధ్య పంచాయితీ పెడుతున్నారు.. బీఆర్ఎస్ 9 సర్వేలు చేసి ఏదీ ఫైనల్ చేయలే. వీళ్లు ఎదుల ఫైనల్ చేశామంటున్నారు.


కానీ దానికి జస్టిఫికేషన్ ఏంటీ? ఉమ్మడి నల్గొండకు నీళ్లు తేలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారు.. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా బస్వాపూర్ రిజర్వాయర్ 80 శాతం పూర్తైంది.. శివన్న గూడెం, కిష్టరాయి పల్లి పూర్తి కాకపోయినప్పటికీ.. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చు.. ఉల్పరకు బస్వాపూర్ నుంచి నీళ్లు తీసుకోవచ్చు. కేవలం 110 కిలోమీటర్ల దూరమే ఉంది.. స్పీడ్ గా పనిచేస్తే రోజుల వ్యవధిలోనే ఈ పనిని పూర్తి చేయవచ్చు.. బస్వాపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేస్తే శివన్నగూడెంకు గ్రావిటీతోనే నీళ్లు తీసుకురావచ్చు. దంటే కొండపోచంపల్లి నుంచి షామిర్ పేట్ ద్వారా శివన్నగూడెం కు గోదావరి నీళ్లను తీసుకోవచ్చు..
దిండికి నీళ్లను ఎత్తిపోసేందుకు ఇప్పుడున్న మార్గం ఇదే. గోదావరి నీళ్లు తేకపోతే దిండికి నీళ్లు రావు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎస్బీసీపై నిర్లక్ష్యం వహించింది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి.. గోదావరి నీళ్లు తీసుకురాకుండా అదనంగా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా వస్తాయి.. మనకు గోదావరి, కృష్ణా లాంటి నదులు ఉన్న సరే ఇలాంటి పరిస్థితులు ఉండటం దురదృష్టం.. రెండు నెలల క్రితం మళ్లీ ఇక్కడ ఒక ఫ్లోరైడ్ కేసు నమోదైంది.. అప్పటి నుంచే ఈ సమస్యకు పరిష్కారం ఉండాలని మెదళ్లను కరిగించి మేధావులతో మాట్లాడి ఒక సొల్యుషన్ ఆలోచించాం.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయటమే ఈ సమస్యకు పరిష్కారం.. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ పోవాలంటే ఈ నేలంతా నది నీళ్లతో నడవాల్సిందే..

అటు గోదావరి, కావేరి అనుసంధానాన్ని కూడా తుపాకుల గూడెం వద్దే చేయాలి.. ఆంధ్రా ప్రభుత్వం పోలవరం వద్ద అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు.. గోదావరి, కృష్ణా అనుసంధానం అవుతేనే మనకు మేలు జరుగుతుంది.. కాళేశ్వరంలో భాగంగా 80 శాతం ఫూర్తైన బస్వాపూర్ ను కంప్లీట్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.. కానీ దాన్ని వదిలేసి ముఖ్యమంత్రి గంధమల్ల వద్ద కొబ్బరి కాయ కొట్టారు.. డబ్బుల కోసమో, పేరు కోసమో ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు.. ముందున్న ప్రాజెక్ట్ లు పూర్తి చేయకుండా వేరే వాటిని పూర్తి చేస్తే ఏం ప్రయోజనం?
తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ముందుగా పెండింగ్ ప్రాజెక్ట్ లనే పూర్తి చేస్తాం.. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్న సరే ఈ ప్రభుత్వం చేయటం లేదు.. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు తుమ్మడి హెట్టి కడతామని చెబుతున్నారు.. ఇప్పటి కూడా భద్రాచం వద్ద నీళ్లు వృథాగా పోతున్నాయి. ఏటా 3500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి..
కృష్ణానది నీళ్లను కాపాడుకునే ప్రయత్నాన్ని గత బీఆర్ఎస్ చేయలేదు.. ఈ మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు.. జూరాల నుంచి శ్రీశైలం వరకు 2 వందల కిలోమీటర్ల దూరంలో ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు.. బీచ్ పల్లి వద్ద పెద్దమారురు కాడ ప్రాజెక్ట్ కట్టి నీళ్లు ఆపుతామని కేసీఆర్ గారు గతంలో చెప్పి దాన్ని పట్టించుకోలేదు.. నల్గొండకు నీళ్లు ఎందుకు రావటం లేదన్నది కచ్చితంగా బుద్ది జీవులు ఆలోచించాలని కోరుతున్నా.. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పోవాలంటే ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు రావాల్సిందే..

అదే విధంగా జిల్లాలో రిజర్వాయర్లు లేవు. మేము అధికారంలోకి వచ్చాక ఫ్లోరైడ్ పోయే విధంగా ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కడుతాం.. ఈ ముఖ్యమంత్రి రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రం గా మారిపోయాడు.. అటు బీఆర్ఎస్ పార్టీ నాన్ ఫర్ ఫార్మింగ్ అసెట్ గా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మర్చిపోయింది.. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పరిష్కారాలు వెతుకుతున్నది టీఆర్ఎస్ మాత్రమే. నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రిగా ఉన్న ఈ జిల్లా మంత్రి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు..
ఎదుల నుంచి నీళ్లు తీసుకోవటం సాధ్యంకాదని తెలిసినప్పటికీ మోసం చేస్తున్నారు.. మిల్లర్ల దగ్గర బియ్యం ఉన్నప్పటికీ వాటిని బయటకు తేలేకపోతోందని ఈ చేతగానీ సర్కార్.. అందువల్లే ఇప్పుడు బియ్యం రేట్లు దారుణంగా పెరుగుతున్నాయి.. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్న ఉన్నప్పటికీ జిల్లాలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి.. దేవరకొండ రోడ్డు మార్గం ఒకవైపు ఎప్పుడూ నిర్మాణంలోనే ఉంటుంది. దేవరకొండ- దిండికి సింగిల్ రోడ్ ఉంది.. జిల్లాలో ఎమ్మెల్యే లకు సంబంధించి అవినీతి అంశాలు చాలా మాట్లాడేవి ఉన్నాయి.. శాశ్వతమైన పరిష్కార మార్గం ఉన్న సరే ఈ ముఖ్యమంత్రి ఆ పని చేయటం లేదు..
రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు భయంకరంగా ఉండే ప్రమాదం ఉంది.. పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి..రైతులకు నష్టం పరిహారం ఏం ఇస్తారో చెప్పాలి? ప్రతి ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాల్సిందేనని మేము డిమాండ్ చేస్తున్నాం.. రైతులకు నీళ్లు, యూరియ కూడా సప్లయ్ చేయలేక వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు.. ముందుగా ఈ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని కోరుతున్నా.. గోదావరి, కావేరి అనుసంధానం తుపాకుల గూడెం వద్దే జరిగేలా చూడాలి..
నాగార్జున సాగర్ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలి.. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై పోరాడుతూనే వాటికి పరిష్కార మార్గాలను మేము వెతుకుతున్నాం.. మా టీమ్ చిన్నదైనా సరే ప్రజల కోసం కష్టపడే టీమ్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది.. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ సహా మిగతా పార్టీలు మొద్దు నిద్రపోతున్నాయి.. వాళ్లకు బుద్ది చెప్పే అవకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో వచ్చింది.. కనుక ప్రజల కోసం పోరాటం చేస్తున్న తమ పార్టీ అభ్యర్తులను గెలిపించాలని కోరారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
