Homeమెదక్‌Sadashivapet | సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం

Sadashivapet | సదాశివపేటలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం

  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్

సదాశివపేట: డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ శిరీష దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శివరాజ్ పాటిల్ సదాశివపేట(Sadashivapet) పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(Suraksha Multi-Specialty Hospital) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిని ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ప్రాంతానికి చెందిన డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ శిరీష దంపతులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఆసుపత్రి ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News