- శంకర్‌పల్లిలో వైభవంగా అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ..Abhayanjaneya Swamy
- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య..Abhayanjaneya Swamy
- హనుమాన్ నామస్మరణతో మార్మోగిన హనుమాన్ నగర్..
శంకర్‌పల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. భక్తుల హనుమాన్ నామస్మరణతో (Abhayanjaneya Swamy) హనుమాన్ నగర్ కాలనీ మార్మోగింది. శంకర్‌పల్లి పురపాలక సంఘం పరిధిలోని 14వ వార్డు హనుమాన్ నగర్ కాలనీలో ఉన్న వీర హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో గురువారం అభయాంజనేయస్వామి ఏకశిలా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, విశేష హోమాలు, శాస్త్రోక్త పూజా కార్యక్రమాల నడుమ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ఈ మహోత్సవానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై అభయాంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తి భావంతో అభయాంజనేయస్వామి ఏకశిలా విగ్రహాన్ని సమకూర్చిన దాతలు కందూరి సునీత – రాజ్‌కుమార్, అమృతవాణి – రాకేష్ దంపతులను ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి మనిషికి మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు సమాజంలో సద్భావన, సన్మార్గాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం అభినందనీయమన్నారు. ఈ మహోత్సవంలో శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, వైస్ చైర్‌పర్సన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ అశోక్,జిల్లా నాయకుడు గోపాల్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ పార్శి బాలకృష్ణ, మున్సిపాలిటీ అధ్యక్షుడు చంద్రమౌళి, జనార్దన్ రెడ్డి, బెజగం రాజేశ్వర్, కందూరి చంద్రకుమార్, మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ తదితర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక కాలనీవాసులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో హనుమాన్ నగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
