Homeరంగారెడ్డిKadthal | కడ్తాల్ రైతుల గోస పట్టదా?

Kadthal | కడ్తాల్ రైతుల గోస పట్టదా?

  • కాంగ్రెస్ ప్రభుత్వంపై జైపాల్ యాదవ్ ఫైర్!
  • కరువు ప్రకటించే వరకు తగ్గేదే లేదు..
  • మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్
  • తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా!

కడ్తాల్: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, కడ్తాల్‌ మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా కడ్తాల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.కడ్తాల్‌ను కరువు మండలంగా ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.సోమవారం కడ్తాల్ తహసీల్దార్ కార్యాలయం(Kadthal Tahsildar Office) ఎదుట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కడారి రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా(ధర్నా (Farmers Protest) నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా?

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించామని గుర్తుచేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోయి రైతులు పెట్టుబడులు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.కల్వకుర్తి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.ఈ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి కల్వకుర్తి నియోజకవర్గ రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.రైతుల పరిస్థితిని గుర్తించి తక్షణమే కడ్తాల్ మండలాన్ని(Kadthal Mandal) కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు,మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మాట్లాడుతూ..కడ్తాల్ మండలంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.రైతుల సమస్యలపై స్పందించని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని కోరారు.

Kadthal Farmers Drought Declaration Demand BRS Protest3

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు శ్యామల ముదిరాజ్,వైస్ ప్రెసిడెంట్ భూపాల్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్. మహేష్, సర్పంచ్ బొప్పిడి గోపాల్, రామచందర్,ప్రియా-రమేష్,చిట్టి రమేష్, వార్డు సభ్యులు మాదారం గణేష్ గౌడ్, రవి నాయక్, మాజీ సర్పంచులు తులసి రామ్ నాయక్, యాదయ్య, నరసింహ గౌడ్, శ్వేత-భూనాథ్, సులోచన-సాయిలు, భాగ్యమ్మ-జంగయ్య, పూజా-దేవా,మాజీ ఎంపీపీ సువాలి పంతు, మాజీ ఎంపీటీసీ రంగయ్య, నాయకులు శ్రీనివాస్ గౌడ్, కోట్య నాయక్, రమేష్, కుమార్,లాయక్ అలీ, జగన్ యాదవ్, యాదయ్య,పాండు నాయక్, వినోద్, సంతోష్ కుమార్, రమణ,మహేష్, లింగం, రాములు, రామచంద్రయ్య, శ్రీకాంత్,వెంకటేష్, నరసింహ,అంజి,శ్రీశైలం, సాబీర్, సరియా తదితర నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News