- రక్తదానం ప్రాణదానం మానవత్వం మహోన్నతకు నిదర్శనం ఏసిపి కిరణ్ కుమార్
మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో పోలీస్ అమరవీరుల స్మారకర్ధం బెల్లంపల్లి రూరల్ సర్కిల్, వన్ టౌన్ పోలీసు,ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్ రక్తదాన శిబిరం(Blood Donation Camp) ఏర్పాటు చేసిన పోలీసులు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో యువత స్వచ్ఛంద సంస్థల సహకారంతో సుమారు 150 మంది యువత రక్తదానం చేశారు.
దేశం కోసం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల స్మరిస్తూ, వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఘనంగా నివాళులర్పించారు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో రక్తదాన శిబిరం(Blood Donation) ఏర్పాటు చేశామని ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందించేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రక్తదానం చేసిన యువతకు ప్రశంసా పత్రాలు అందచేసి ఈ రక్తదాన శిబిరానికి(Blood Donation) సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రోజుల్లో సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సొసైటీ వారికి సహాయం అందించేందుకు కృషి చేస్తామని ఏసిపి కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు,వైద్య సిబ్బంది యువత,స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
