Homeఆదాబ్ ప్రత్యేకంAyyappa Society | అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు.. కపట నిద్రలో అధికారులు..

Ayyappa Society | అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు.. కపట నిద్రలో అధికారులు..

  • కోర్టు వివాదాలున్న భూముల్లో ఆగని అక్రమాలు
  • ఇక్కడ ఎలాంటి అనుమతులకు తావు లేదు..
  • కానీ ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
  • మీ దగ్గర డబ్బు, పలుకుబడి ఉంటే చాలు ఏదైనా సాధ్యమే
  • నిబంధనలను గాలికొదిలేస్తున్న అక్రమార్కులు
  • స్పందించాలని డిమాండ్ చేస్తున్న సామాజిక వేత్తలు..

మణికొండ ఘటన మరవక ముందే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆకాశహర్మ్యాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

“ఇక్కడ ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు.. అనుమతులు లేకపోయినా పర్వాలేదు..” ఇదే నేడు శేరిలింగంపల్లి పరిధిలోని ప్రఖ్యాత అయ్యప్ప సొసైటీ సొంతం చేసుకున్న సరికొత్త ‘స్పెషాలిటీ’! అసలు ఈ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుంది? హెచఎండీఏ పరిధిలో ఉందా? జీహెచఎంసీ పరిధిలో లేదా? లేక ఇక్కడి నిర్మాణాలకు మున్సిపల్ నిబంధనలు వర్తించవా?

- Advertisement -

హైదరాబాద్ మహానగరంలో మాదాపూర్ అనే ఒక సంపన్నమైన ప్రాతం ఉంది.. అక్కడ అయ్యప్ప సొసైటీ(Ayyappa Society) ఏరియా వుంది.. ఈ సొసైటీ కి 11/31, 12 అనే సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి.. కాగా ఈ ప్రాంతం చాలా కాలంగా న్యాయస్థానంలో పెండింగ్ లో వుంది.. దీనితో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి వీలులేదు.. అలాగే ఈ ఏరియాలో కరెంట్, డ్రైనేజీ, రోడ్స్, మున్సిపల్ లాంటి అనుమతులు కూడా ఇవ్వడానికి వీలులేదు.. కానీ ఇక్కడ గజం సుమారు 2 లక్షల రూపాయల పై చిలుకు పలుకుతుంది.. ఒక చదరపు అడుగు దాదాపు రూ. 7000 నుంచి 10000 వరకు ఉంటుందని తెలుస్తోంది..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరగవు.. మరి ఇంతింత ధర ఎలా పలుకుతోంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.. కొంతమంది చట్టంలోని లోపాలను చూపిస్తూ పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఆ తరువాత కోర్టు ఆర్డర్ తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకుంటున్నారు.. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా తమ పరపతి, డబ్బు ఉపయోగిస్తూ అక్రమంగా పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తూ ఉన్నారు.. ఎన్ని అంతస్తులైనా కట్టేస్తుంటారు.. కమర్షిల్ బిల్డింగ్స్ నిర్మిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎలాంటి ఢోకా ఉండదు.. ఇక్కడ వ్యాపారాలన్నీ జీరో మనీతో సాగుతుంటాయి.. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు లోన్స్ ఇవ్వవు.. అందుకే ఇక్కడ అంతా బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతుంది..

నో వైట్ ఓన్లీ బ్లాక్.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ వందలకొద్దీ బిల్డింగులు నిర్మిస్తూ ఉన్నారు.. ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి.. కాగా కొందరు సంబంధిత అధికారులకు ఇక్కడ అక్రమ నిర్మాణాలు కాకుండా కేవలం పచ్చనోట్లు మాత్రమే కనిపిస్తుంటాయి.. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు కొందరు కోటీశ్వరులు అయిపోతున్నారు.. ఇక్కడ జరుగుతున్న వ్యవహారంపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వవు.. విషయం ఏమిటంటే ఇక్కడ అందరికీ అమ్యాయాలు అందుతూనే ఉంటాయి..

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రాంతానికి ఎవరు ఎమ్మెల్యే అయినా వారికి 3 పూవులు 6 కాయలు.. డబ్బులే డబ్భులు.. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు కావొస్తోంది.. ఇక్కడ అక్రమ నిర్మాణాల వ్యవహారం యథేచ్ఛగా కొనసాగుతూనే వుంది.. మరి ఇంత జరుగుతున్నా అధికార ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా..? మరి ఎందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. ఇక్కడ అక్రమానిర్మాణాల ద్వారా రైజ్ అవుతున్న బ్లాక్ మనీ ఎవరి జోబుల్లోకి వెళ్తోంది..? అన్నది తేలాల్సి ఉంది..

మరి ఈ బిల్డింగ్స్ ప్రమాదకరం కాదా..? ఇవి అధికారులకు కనిపించడం లేదా..? స్పెషల్ డ్రైవ్ చేసాం.. చాలా బిల్డింగ్స్ ని గుర్తించాం.. వాటికి నోటీసులు ఇచ్చాము..అని చెబుతూ అధికా రులు చేతులు దులుపుకున్నారు.. మరి వాటిమీద ఎందుకు చర్య లు చేపట్టడం లేదు.. దీనికి సమాధానం చెప్పాలి.. ఒక బిల్డింగ్ కి ఓసీ రాకపోతే కరెంట్ కనెక్షన్ రాదు.. కానీ ఇక్కడ కరెంట్ కనెక్షన్స్ ఉంటున్నాయి.. ట్రాన్స ఫార్మ్స్ ఉంటున్నాయి.. ఇంటి నెంబర్ లు కూడా అలాట్ అవుతున్నాయి.. ఇదెలా సాధ్యం..?

“ఇక్కడ ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు.. అనుమతులు లేకపోయినా పర్వాలేదు..” ఇదే నేడు శేరిలింగంపల్లి పరిధిలోని ప్రఖ్యాత అయ్యప్ప సొసైటీ(Ayyappa Society) సొంతం చేసుకున్న సరికొత్త ‘స్పెషాలిటీ’! అసలు ఈ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుంది? హెచఎండీఏ పరిధిలో ఉందా? జీహెచఎంసీ పరిధిలో లేదా? లేక ఇక్కడి నిర్మాణాలకు మున్సిపల్ నిబంధనలు వర్తించవా? అనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి రుసుములు చెల్లించకుండా, ఏ పర్మిషన్లు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుంటే.. ప్రభుత్వ ఖజానా నిడుతోందో లేదో తెలియదు కానీ, అక్రమార్కుల జేబులు మాత్రం నిండుతున్నాయనేది నగ్నసత్యం.

Ayyappa Society Illegal Constructions Raise Questions Over Official Action5

కళ్లెదుటే అక్రమాలు.. అధికారుల మౌనమేల?

బహిరంగంగా, పగటిపూటే నిబంధనలకు విరు ద్ధంగా ఇన్ని అక్రమ నిర్మాణాలు జరుగు తుంటే టౌన్ ప్లానింగ్, జీహెచఎంసీ, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్లు? కోట్ల రూపాయల అక్రమాలకు తెరలేపుతున్న ఈ తంతులో అధి కారులు ఎంతకు అమ్ముడుపోయారనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ‘అయ్యప్ప సొసైటీలో(Ayyappa Society) ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టాను సారంగా కట్టుకోవచ్చు’ అనే అంతర్గత చట్టాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో అసలు ఏం జరుగుతుం దనే దానిపై తీవ్రఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాణాల మీదకొచ్చినా మారని తీరు :

ఇటీవలే మణికొండ ప్రాంతంలో ఇదే తరహాలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనం కుప్పకూలి పలువురు అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఆ విషాద ఛాయలు ఇంకా వీడకముందే, అయ్యప్ప సొసైటీలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటం చూస్తుంటే అధికారుల వెన్నుదన్ను ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అధికారుల అనైతిక వ్యవహారాలను, అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాల్సిన యంత్రాంగం ఎక్కడ నిద్రపోతోందని సామాజిక వేత్తలు మండిపడుతున్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. :

హైదరాబాద్ నగరంలో జీహెచఎంసీ ఏ రకంగానైతే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ కూల్చివేతలు చేపడుతుందో, అదే తరహాలో అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాలను కూడా వెంటనే నేలమట్టం చేయాలని ప్రజా సంఘాలు, సామాజిక వేత్తల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, భద్రతా లోపాల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మున్సిపల్ శాఖ అధికారులు వాటిని పెడచెవన పెడుతున్నారు.

చట్టం ముందు అందరూ సమానులే అనే పారదర్శక పాలనను ప్రభుత్వం అందిస్తున్న తరుణంలో.. ఈ అధికారుల అవినీతి బాగోతం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. తక్షణమే అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం స్పందించి కూల్చివేత చర్యలు చేపట్టాలని, లేనియెడల ప్రజాక్షేత్రంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు పూర్తిగా నేలకూలే వరకు, ఈ వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు ‘ఆదాబ్ హైదరాబాద’ దినపత్రిక తన పోరాటాన్ని ఆపదని హెచ్చరిస్తున్నాం..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News