- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల వారికి భరోసా కల్పించడానికి మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరిక మేరకు నవంబర్ 1వ తేదీన ఆదిలాబాద్ డైట్ కాలేజి మైదానంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే రైతు గర్జన సభకు(Rythu Garjana Sabha) కేటీఆర్ హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా రైతు గర్జన సభకు సంభందించి హలొ రైతు ఛలో ఆదిలాబాద్ పోస్టర్ ను మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ విప్ బాల్క సుమన్ గార్లతో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ… రైతుల ఆత్మహత్యలు ఆగాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎదిరించి రాష్ట్రం సాధించిన రైతు కేసీఆర్ రైతులకు అండగా నిలిచి వారిని రాజు చేశారు.

మళ్ళీ కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కేటీఆర్ కలవనున్నారన్నారు. అనంతరం డైట్ మైదానాన్ని సందర్శించి పనులని పరిశీలించారు. జిల్లాలోని ప్రతీ రైతు నవంబర్ 1వ తేదీన రైతు గర్జన సభకు హాజరుకావలన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
