- ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని అధికారులు
- వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ ఆరోపణలు..
- ఇప్పటికైనా కమిషనర్ స్పందించేనా?
కూకట్పల్లి: తీరని ప్రజా సమస్యలు.. స్పందించని అధికారులు.. అక్రమ నిర్మాణాలపై అంతులేని ఫిర్యాదులు! కూకట్పల్లి జోన్లో(Kukatpally Zone) అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అక్రమ నిర్మాణాలపై స్థానికులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబి స్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేరు మారినా.. పరిస్థితి మారలేదా..? : జీహెచఎంసీ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలోకి మారిన తర్వాత కూడా కూకట్పల్లి జోన్లో(Kukatpally Zone) పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మారినా వ్యవస్థలోని లోపాలు మాత్రం కొనసాగుతు న్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
డీసీ బిజీ.. ఏసీపీ ఎక్కడ..? : జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, క్షేత్రస్థాయి తనిఖీల విషయంలో సంబంధిత అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీసీ అందుబాటులో ఉండటం లేదని, ఏసీపీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాల నియంత్రణ బాధ్యత ఎవరు నిర్వహిస్తున్నారనే ప్రశ్నకు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఫిర్యాదుదారులకు సమాధానాలేవీ..? : అక్రమ నిర్మాణాలు, షెడ్లపై ఫిర్యాదులు చేసిన స్థానికులు వాటిపై తీసుకున్న చర్యల వివరాలు తెలుసుకునేందుకు కార్యాలయాలను ఆశ్రయిస్తున్న ప్పటికీ స్పష్టమైన సమాచారం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. కొందరు ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై సంబంధిత అధికారులు స్పందించి, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆల్విన్ కాలనీలో అక్రమ నిర్మాణాలు : ఆల్విన్ కాలనీ సర్కిల్-51 పరిధిలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణాలకు సంబంధించిన వివరాలు ఇవి: ఆల్విన్ కాలనీ: లాస్ట్ బస్ స్టాప్ సమీపంలోని ప్లాట్ నంబర్ 128/సి., హైదర్‌నగర్ హెచఎంటీ హిల్స్‌లోని ప్లాట్ నంబర422.,అడ్డగుట్ట సొసైటీ, వెస్ట్రన్ పార్ట్‌లో ప్లాట్ నంబర్ 101సి, ఈస్ట్రన్ పార్ట్‌లో ప్లాట్ నంబర్లు 101సి, 102సి. ఈ నిర్మాణాల అనుమతులు, భవన నిర్మాణ నిబంధనల అమలు, సంబంధిత ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను అధికారులు పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలి.
కమిషనర్ స్పందిస్తారా..? : కూకట్పల్లి జోన్లో అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులు సమీక్షించి, అవసరమైన చోట క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఫిర్యాదుల స్థితిగతులను ప్రజలకు తెలియజేసే పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలకు సంబం ధిత అధికారులు ఏమి సమాధానం చెబుతారు? ఫిర్యాదులపై చర్యలు ఎప్పుడు చేపడతారు? ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారా? ఈ ప్రశ్నలకు అధికారుల స్పందనతో పాటు వాస్త వాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మరిన్ని ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల వివరాలు, సంబంధిత ఫిర్యాదులపై పూర్తి ఆధారాలతో తదుపరి కథనంలో వెలుగులోకి తీసుకుని రానుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
