Homeనల్లగొండHuzurnagar Police | పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Huzurnagar Police | పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

  • అమరవీరులకు నివాళిగా హుజూర్‌నగర్‌లో బైక్ ర్యాలీ…
  • ప్రజల రక్షణే లక్ష్యంగా పోలీసుల సేవలు: ఎస్‌ఐ చలికంటి నరేష్…

హుజూర్‌నగర్: ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని హుజూర్‌నగర్ ఎస్‌ఐ చలికంటి నరేష్(Huzurnagar SI Chalikanti Naresh) అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో(Huzurnagar Police) బైక్ ర్యాలీ(Bike Rally) నిర్వహించారు.పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి ఇందిరా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి సేవలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.పోలీసుల క్రమశిక్షణ, ప్రజల పట్ల బాధ్యత, అమరవీరుల పట్ల గౌరవాన్ని చాటిచెప్పిన ఈ ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఎస్‌ఐ చలికంటి నరేష్ మాట్లాడుతూ సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -

విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. వారి ఆశయాలు, ఆదర్శాలను కొనసాగిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించడమే అమరవీరులకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News