భాయ్
శంకమోలే మడిచి
జారిపోతాయేమోననే భయంతో
కాగితం సుట్టూ దారం సుట్టీ
పైలంగా మలిశిన పొట్లం
ఈ జీవితం(Life)
ఆదరాబాదరా ఇప్పకు
ఆగమాగం దారం బీ గుంజకు
అగుడగుడని ఇప్పితే
పొట్లంలకెళ్లి రాలి
నేలపాలైతై
దబ్బదబ్బ ఇప్పుదామని గుంజితే
దారంతో పాటు
కమ్మ కూడా చినిగి
చిల్లంకల్లం అయితై
మిఠాయి కొట్టుల పొట్లం కట్టమంటే
మనమేమి జెప్పితే గవే కడుతడు
కానీ
గిది బతుకు పొట్లం
నీకు నచ్చినయే కట్టమంటే
కుదురదీడా…
బతుకు తొవ్వెంట పోతుంటే
ఎదురచ్చినయల్లా ఒడిపి కట్టుకునేదే
ఈ మాయల పొట్లం
తీరుబడి
జీవితం(Life) కాసింత నిమ్మదించినంకా
ముడేసిన పొట్లంలా
ఏమేమున్నయో నని
ఇగురంగా ఇప్పి మల్లొకపారి
నాలుక మీదేసి సప్పరిస్తే…
కొన్ని కారం కారం ఉండచ్చు
కొన్ని కరక్కాయలెక్క
ముందుగాల ఒగరొగరున్నా
శెమట సుక్కలు గొంతు తడిమితే
తీపి ఊటలా ఊరనూ వచ్చు
ఆడాడా…
మసాలా ఘాటు మండినట్టే మండి
నిమ్మరసం ఉల్లిపాయ తగలగానే
కమ్మగున్నట్టు తోచవచ్చు
కమ్మగా గొంతులోకి జారుతున్నపుడే
అప్పుడప్పుడు కన్నీరు తాకి తాకి
ఉప్పుండలు కట్టుకున్న గింజలు కొన్నీ
నాలుక మీదకెళ్లి జారి గొంతుల పడ్తై
మింగలేకుండా కళ్ళు మూసుకుంటే
నలుపు తెలుపు బొమ్మలు
రెప్పల కింద కదుల్తై
సింగిడసొంటి యాదులు
ఎదమీద శిందులేత్తై
జీవితం(Life)
ఓ కట్టా… మీఠా పొట్లం
ఉప్పుప్పున్నదని విసిరేయలేము
తీయగుందని ఒరకు పెట్టుకుని
కొసరి కొసరి తినలేము
ఒక్కో గింజ తర్వాత ఒక్కో గింజను
ఏ రుచి తాకితే దాన్ని మింగుకుంటా
మల్లేమొత్తదోనని తలుసుకుంటా
లాగించడమే…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
