వెంకటాపురం: దసరా మహోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కాఫెడ్ మైదానంలో వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్ (వి సి ఎ) ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 03 క్రికెట్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. రోడ్నీలో భాగంగా ఏడవ రోజు కొనసాగుతున్న పోటీల్లో సేవ్ టు నో డ్రగ్ అనే నినాదంతో దూసుకు వెళ్తున్న విపిఎల్ సీజన్ 3(VPL Season 3) లో శనివారం ఏకే వారియర్స్ వర్సెస్ వైకింగ్ వారియర్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి వైకింగ్ వారియర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా… మొదట బ్యాటింగ్ చేసిన ఏకే వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ దిగిన వైకింగ్ వారియర్స్ 8.5 ఓవర్లలోనే 72 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని చేదించింది.
ఈ మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ ను కనబరిచిన ఇమ్రాన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో మ్యాచ్ హంటర్స్ వర్సెస్ స్టార్ లెవెల్ మధ్య జరగగా మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి స్టార్ లెవెన్ ఫీల్డింగ్ ఎంచుకున్న ది. మొదట బ్యాటింగ్ చేసిన హంటర్స్ నిర్ణీత 10 ఓవర్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 136 అత్యధిక పరుగులు చేసింది.

సెకండ్ బ్యాటింగ్ దిగిన స్టార్ లెవెన్ మ్యాచ్లో 10 ఓవర్స్ లో 5 వికెట్లు కోల్పోయి 120 చేసింది. 16 పరుగుల తేడాతో హంటర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి 22 బంతుల్లో 3 ఫోర్లు, 7సిక్సులతో 60 పరుగులు తో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నిఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో మ్యాచ్లో ఏకే వారియర్స్ వర్సెస్ సూర్య కొంగల కింగ్స్ మధ్య జరిగిన సూర్య కొంగల కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ చేయడం జరిగింది. మొదట బ్యాటింగ్ దిగిన ఏకే వారియర్స్ నిర్ణీత 9.4 ఓవర్ల లో 10 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.
సెకండ్ బ్యాటింగ్ దిగిన సూర్య కొంగాల కింగ్స్ ఉత్కట్టంగా జరిగిన మ్యాచ్లో 6.1 ఓవర్స్ లో 63 పరుగులు చేసి 7వికెట్లు కోల్పోయి సూర్య కొంగల కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కోటి కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన హంటర్స్ ప్లేయర్ నిఖిల్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ద్వాలియా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముక్తార్ హుస్సేన్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చి సత్కరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
