సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’(I Hate Marriage) ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో పరమేశ్ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ‘అప్పుడే పెళ్లా’ అనే లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం.
జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది. ప్రతి యువత ఈ సినిమాలో క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే ఫ్రెష్ కంటెంట్ మా చిత్రంలో వుంది’ అన్నారు. హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి,ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్,బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటి ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: Vijay C Kumar
సంగీతం: Varikuppala Yadagiri
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: Praveen Immadi
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
PRO: మడూరి మధు
ఆర్ట్: మోహన్ జల్లా
అడిషనల్ డైలాగ్స్: శ్రీనివాస్ తేజ
పాటలు: Varikuppala Yadagiri
కొరియోగ్రఫీ: అల్లు చాణక్య, రాజ్ కృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్: బి. ఎస్. నాగిరెడ్డి
కో-ప్రొడ్యూసర్స్: సంతోష్ రేణికుంట్ల,
కాశీగారి కోదండ రామ శర్మ
ప్రొడ్యూసర్స్:
దయానంద్ మాదం
కార్తిక్ వెంపటి
కథ – మాటలు – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: Parmesh Renukuntla
