Homeనిజామాబాద్‌Chityala | నాయకమ్మ ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు

Chityala | నాయకమ్మ ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు

తాడ్వాయి: తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో (Chityala Village)వెలసిన నాయకమ్మ దేవాలయంలో(Nayakamma Temple) శుక్రవారం నాయకమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, దీపారాధనలు చేశారు. స్త్రీలు సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, కుటుంబ సంక్షేమం కోరుతూ అమ్మవారి విశేష కృపాకటాక్షాల కోసం కుంకుమ పూజలు నిర్వహించడం హైందవ సాంప్రదాయంలో విశిష్టమైనదని నిర్వాహకులు తెలిపారు. కుంకుమార్చనతో సకల దోషాలు తొలగి, సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నాయకమ్మ సేవాసమితి ప్రతినిధి అంబీర్ మనోహర్, భువనేశ్వర్రావు రావు,సర్పంచ్ రంజిత్ రెడ్డి, బాలకిషన్, సిద్దారెడ్డి, రమేష్,మురళి, ఆంజనేయులు,అమృత్ రావు,సిద్ధారములు, భూపతి, రుతవి కి, రాజు, నరేందర్ రావుతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News