Homeరంగారెడ్డిInspection | ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

Inspection | ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ

  • పెండింగ్‌ కేసుల పరిష్కారానికి వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలి
  • దసరా వేడుకల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి

ఆమనగల్లు: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఆమనగల్లు పోలీస్‌స్టేషన్‌ను మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకి రెడ్డి(ACP Janaki Reddy) శుక్రవారం వార్షికంగా తనిఖీ(Inspection) చేశారు. పోలీస్ కమిషనర్ ఫ్యూచర్ సిటీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పరేడ్‌,టర్నౌట్‌ను పరిశీలించడంతో పాటు స్టేషన్‌లోని పలు విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమనగల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ ఎస్.వెంకటేశ్వర్లుతో కలిసి నేరాలకు సంబంధించిన రికార్డులు, సీసీటీఎన్ఎస్‌, పెండింగ్‌ కేసులు, శాంతిభద్రతల పరిస్థితి, పెట్రోలింగ్‌, నిఘా వ్యవస్థ, మహిళల భద్రత,ఫిర్యాదులు, వారెంట్లు, స్టేషన్‌ పరిపాలనకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.

పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు,రికార్డుల గదులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి,కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఏసీపీ సూచించారు. సమర్థవంతమైన పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని,రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్‌ సిబ్బంది క్రమశిక్షణ, పరిశుభ్రత పాటించాలని,ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి మెరుగైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.

- Advertisement -

దసరా వేడుకలకు పటిష్ట భద్రత

అనంతరం ఆమనగల్లు కళాశాల మైదానాన్ని సందర్శించిన ఏసీపీ,అక్కడ నిర్వహించనున్న దసరా వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News