Homeఆదిలాబాద్Bathukamma Celebrations | కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

Bathukamma Celebrations | కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

  • పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బతుకమ్మలకు పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పూల బతుకమ్మలను పేర్చి, ఆయా శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వీరితో పాటుగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా లయబద్దంగా బతుకమ్మ ఆడారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ అంటే ప్రకృతి, వ్యవసాయం, రైతులతో మమేకం అయ్యి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు అన్ని సమస్యల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు రైతులకోసం ప్రార్థించాలని కోరారు.

- Advertisement -

జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకల్లో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఖజానా శాఖ అధికారి సరోజ, మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News