Homeక్రైమ్ వార్తలుACB Raid | కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

ACB Raid | కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

  • రూ.2.5 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వో, ప్రైవేట్ ఉద్యోగి

మేడ్చల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు(ACB Raid) నిర్వహించారు. భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి, వీఆర్వో విజయ్ కుమార్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

image

రూ.5 లక్షలు డిమాండ్.. రూ.2.5 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత

- Advertisement -

బాధితుడికి చెందిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలు లంచంగా డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.(ACB Raid) ఈ నేపథ్యంలో గురువారం రూ.2.5 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News