Homeఆదాబ్ ప్రత్యేకంIllegal Crusher | యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ క్రషర్ దందా..

Illegal Crusher | యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ క్రషర్ దందా..

ఎలాంటి సరైన పత్రాలు లేవు.. ఒక్క గుంట భూమి కూడా లేదు.. భూమి ఒకరి పేరుమీద వుంది.. అనుమతులు వేరొకరి పేరుమీద ఉన్నాయి.. కానీ నిర్భయంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది.. కోర్టుపరిధిలో ఉన్నా కరెంట్ సప్లై జరుగుతోంది.. దీని వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అక్రమ క్రషర్(Illegal Crusher) నిర్వహణతో పరిసర ప్రాంతాలు కాలుష్యంగా మారిపోతున్నాయి.. కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు..

ఈ అక్రమ వ్యవహారంపై పలుమార్లు ఆదాబ్ హైదరాబాద్ ఆధారాలతో సహా కథనాలు ప్రచురించినా అధికారుల్లో స్పందనలేకపోవడం దురదృష్టం.. దీనిపై తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ వారు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.. జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం ఈ అక్రమ క్రషర్ వ్యవహారం తీసుకుని వెళ్లారు.. కానీ ఎలాంటి ఫలితం లేదు.. అక్రమ క్రషర్(Illegal Crusher) నిర్వహిస్తున్న వ్యక్తిమీద, క్రషర్ లీజ్ కు తీకున్న వ్యక్తులపైనా, అడ్డదారిలో పరిమిషన్ ఇచ్చిన అధికారులపైనా ఏసీబీ, సీఐడీ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకుని వెళ్తామని వారు హెచ్చరిస్తున్నారు..

- Advertisement -
  • స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు..
  • కోర్టుపరిధిలో వున్న క్రషర్‌కి విద్యుత్ కనెక్షన్లు..
  • కోట్ల రూపాయల అక్రమ దందా..?
  • ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..
  • లంచాలకు లొంగిపోయిన పొల్యూషన్ కంట్రోల్, మైనింగ్ అధికారులు..?
  • ఈ భారీ అక్రమ వ్యవహారంపై ఏసీబీ, సీఐడీ విచారణ జరిపించాలి..
  • డిమాండ్ చేసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్..

యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం, చెల్లూరు విలేజ్ సర్వే నంబర్ 322/4లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ క్రషర్(Illegal Crusher) యూనిట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి సరైన పత్రాలు, భూమి యాజమాన్య హక్కులు లేక పోయినా.. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎలక్ట్రిసిటీ అధికారుల లాలూచీతో ఈ అక్రమ దందా మూడు పూలు ఆరు కాయ లుగా సాగుతోందని తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో లేదా బహిరంగ వేదికపై చర్చకు రావాలని ఆయన క్రషర్ నిర్వాహకులకు సవాల్ విసిరారు.

ప్రధాన ఆరోపణలు, అక్రమాల బాగోతం :

భూమి ఎవరి పేరున ఉంది? పర్మిషన్ ఎవరికి వచ్చింది? : ఈ క్రషర్ కోసం 2019లో దరఖాస్తు చేయగా, 2021లో ‘శ్రీని డెవల పర్స’ పేరు మీద పర్మిషన్ మంజూరైంది. అయితే ఈ కంపెనీ పేరు మీద కనీసం ఒక్క గుంట భూమి కూడా లేదని, స్వయంగా క్రషర్ యజమాని కర్నాటి నారాయణరావు కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ సమర్పించారు. ప్రస్తుతం ధర ణి, భూభారతి రికార్డుల ప్రకారం ఈ భూమి మొత్తం ‘శ్రీనాథ్ ఇన్ఫ్రా’ పేరు మీదనే ఉంది.

అధికారుల అవినీతి – డాక్యుమెంట్ల మాయాజాలం : మైనింగ్ శాఖ అధికారులకు శ్రీనాథ్ ఇన్ఫ్రా పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ సమర్పించినా పర్మిషన్ ఇచ్చేశారు. ఇక పొల్యూ షన్ బోర్డు అధికారులకు ‘జాస్తి సుబ్బారావు’ పేరు మీద ఉన్న డాక్యుమెంట్లు పెట్టి అనుమ తులు పొందారు. చుట్టుపక్కల గ్రామాలకు, గ్రామ పంచాయతీలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, పబ్లిక్ హియరింగ్ నిర్వహించ కుండానే అప్పట్లో ఈ పర్మిషన్లు జారీ చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అసోసి యేషన్ ఆరోపిస్తోంది. దీని వెనుక స్థానిక రాజ కీయ నాయకులహస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

దూర ప్రాంతపు భూమికి అనుమతులు : క్రషర్ నడుస్తున్న భూమికి, జాస్తి సుబ్బారావు పేరుతో ఉన్న భూమికి దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి తప్పుడు పత్రాలతో అనుమతులు మంజూరు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

విద్యుత్ శాఖ అధికారుల అడ్డగోలు నిర్ణయాలు : కోర్టు స్టే ఉన్న భూమిలో కరెంటు స్తంభాలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా తమ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ఎలక్ట్రిసిటీ బోర్డు స్పష్టం చేసిందని తెలిపారు. ఒక ఇండస్ట్రీ పేరు మీద ఇచ్చిన విద్యుత్ కనెక్షన్‌ను మరొకరి పేరుకు అడ్డగోలుగా మార్చి వాడటం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై ఏడీలు, డీఈలు, ఈఈలపై ఏసీబీ దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్, ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

వందల కోట్ల అక్రమ దందా : గంటకు 300 టన్నుల సామర్థ్యంతో రోజుకు కనీసం 18 గంటల పాటు ఈ క్రషర్ నడుస్తూ వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ దందా సాగుతోంది. దీనిపై కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు.
నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలి : అక్రమ క్రషర్ నడుపుతున్న ‘శ్రీని డెవలపర్స’ యజమా నులు కర్నాటి శ్రీదేవి, యశ్వంత్ శ్రీనివాసులతో పాటు, దీనిని లీజుకు తీసుకుని నడుపుతున్న ‘జీ.హెచ్.కె. ఇన్ఫ్రా’ అధినేత గంటా హరికృష్ణ, మరో డైరెక్టర్ గంటా రజినిలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బహిరంగ చర్చకు సవాల్ : “మీది అంతా కరెక్టే అయితే మీడియా ముందుకు వచ్చి డాక్యుమెంట్లు ఎందుకు చూపించలేక పోతున్నారు? పబ్లిక్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయండి, నిజాలు బయటపడతాయి. లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రండి.. తేదీ మీరే చెప్పండి, మేం వస్తాం” అని క్రషర్ యజ మానులకు కొల్లూరు శ్రీనివాd Ÿరావు సవాల్ విసిరారు. ఈ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ముఖ్య మంత్రికి త్వరలోనే సమగ్ర ఫిర్యాదులతో కూడిన లేఖలు సమర్పిస్తామని, స్పందించక పోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News