- పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
- ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.


సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి (Prajavani Applications) కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సమీక్షించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో (Prajavani Applications) భాగంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ దరఖాస్తులను కలెక్టర్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
