Homeహైదరాబాద్‌Mamidi Somaiah | హైకోర్టు ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం..

Mamidi Somaiah | హైకోర్టు ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం..

  • కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుకు సిద్ధమవుతున్న
  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు పిటిషనర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య (Mamidi Somaiah) సిద్ధమవుతున్నారు. మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు ప్రాతినిధ్యం ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన కీలక ఉత్తర్వుల గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడం పై పిటీషనర్ మామిడి సోమయ్య తీవ్ర ఆవేదన చెందుతూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను, ఆదేశాలను నిర్ణీత కాలంలోగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది.

ఒకవేళ ఆ నిబంధనలను పాటించకపోతే, దానిని న్యాయవ్యవస్థను ధిక్కరించినట్లు భావిస్తూ ‘కోర్టు ధిక్కరణ చట్టం,1971 (Contempt of Courts Act, 1971) కింద తగిన చర్యల కోసం బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సంఘానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య (Mamidi Somaiah) రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతూ, టీడబ్ల్యూజేఎఫ్ కు అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)లలో ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆగస్టు మూడో తేదీన హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఆరు వారాల్లో గా అమలు చేయాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాల అమలు గడువు ముగిసినా ఆదేశాలను అమలు చేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో పిటీషనర్ మామిడి సోమయ్య తిరిగి హైకోర్టు ను ఆశ్రయించి రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సిద్దమవుతున్నారు.

- Advertisement -

ఇటీవలి కాలంలో వివిధ ప్రభుత్వ విభాగాలు న్యాయస్థానాల ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, తమకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, బాధ్యులైన ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేసేందుకు పిటిషనర్ మామిడి సోమయ్య (Mamidi Somaiah) తరఫు న్యాయవాదులు ముసాయిదా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలు కానుంది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గానూ సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల డీపీఆర్వోలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చనున్నారు. ఈ ధిక్కరణ కేసు ద్వారానైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి హైకోర్టు ఆర్డర్ అమలు అవుతుందా? లేక contempt of court act ద్వారా జైలు పాలవుతారా?అనేది వేచి చూడాలి. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News