Homeమెదక్‌Pedda Narasimha Goud | పెద్ద నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు..

Pedda Narasimha Goud | పెద్ద నరసింహ గౌడ్ జన్మదిన వేడుకలు..

  • ఇటీవలే గౌడ సంఘం, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన నరసింహ..
  • కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన నాయకులు, కార్యకర్తలు..
  • శాలువ, పూలమాలతో సత్కరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు..

నూతన గౌడ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ముఖ్య కార్యకర్త, వీర అభిమాని, బిఆర్ఎస్ పార్టీ యువనాయకుడు మరియు సదాశివపేట నెంబర్ వన్ సొసైటీ ఉపాధ్యక్షులు అయిన పెద్ద నరసింహ గౌడ్ (Pedda Narasimha Goud) జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, గౌడ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనతో కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారంలో, ప్రజాసేవలో ముందుండే మిత్రులు పెద్ద నరసింహ గౌడ్ (Pedda Narasimha Goud) ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఆయనను శాలువ, పూలమాలతో మిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో పిల్లోడి సతీష్, తాటపల్లి రామరెడ్డి, బూసరెడ్డిపల్లి వెంకటరమణ, రాఘవేందర్ గౌడ్, కాశీ గౌడ్, అనంతరెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

​

- Advertisement -
RELATED ARTICLES

Latest News