- ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఎమ్మెల్యే గడ్డం వినోద్ …

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, (Breakfast Scheme) వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల//జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.

హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం (Breakfast Scheme) అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఎదిగి చదువుపై పూర్తి శ్రద్ధ చూపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రయ్య బెల్లంపల్లి ఎంఈఓ బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రత్నం సుకుమారి కౌన్సిలర్ జంగం కల్పన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
