Homeఆదిలాబాద్Collector Bhavesh Mishra | న్యూ కంజర్‌ భూ సమస్యలకు త్వరలో పరిష్కారం

Collector Bhavesh Mishra | న్యూ కంజర్‌ భూ సమస్యలకు త్వరలో పరిష్కారం

  • చామన్‌పల్లిలో రీ-సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

లక్ష్మణచందా మండలం న్యూ కంజర్, చామన్‌పల్లి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) బుధవారం పర్యటించి భూ సమస్యలు, రీ-సర్వే పనుల పురోగతిని పరిశీలించారు.

Bhavesh Mishra New Kanjar Land Issues0

ముందుగా న్యూ కంజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామస్తులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో భూముల పట్టాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో గ్రామస్తుల సహకారం కీలకమని పేర్కొన్నారు.

- Advertisement -

భూ సమస్యలపై గ్రామసభలు నిర్వహించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భూముల పట్టాలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే గ్రామసభల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్తుల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు చొరవతో పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం చామన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ-సర్వే పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న కమతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన రీ-సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Bhavesh Mishra New Kanjar Land Issues1

రీ-సర్వేలో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సర్వే బృందం సిబ్బంది పర్యవేక్షణలో, సంబంధిత భూ కమతాల రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో వనజ, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, లక్ష్మి, ఉప సర్పంచ్‌లు ముత్యం, గంగారెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News