మఠంపల్లి: మద్యం మత్తులో కట్టుకున్న భార్యను బ్యాట్ తో తలపై మోదడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృ*తి(Husband Ki**s Wife) చెందిన విషాద ఘటన మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు… మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామానికి చెందిన దేశబోయిన అచ్చయ్య (36) వృత్తిరీత్యా కార్ ట్రావెల్స్ యాజమానిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అచ్చయ్యను ప్రశ్నించగా ఆవేశానికి లోనై,మద్యం మత్తులో అక్కడే ఉన్న బ్యాట్ తో తన భార్య చంద్రకళ (34) తలపై బలంగా మోదడంతో అపస్మారక స్థితిలో వెళ్లిందని స్థానికులు తెలిపారు.
ఈ దాడిలో చంద్రకళ తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది.వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుజూర్ నగర్ లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి బుధవారం చంద్రకళ మృ*తి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భార్యపై దాడి చేసిన అనంతరం నిందితుడు తన కారులో అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు పేర్కొన్నారు.మృతురాలు చంద్రకళకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తల్లి మృ*తితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో పెదవీడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు సమాచారం.ఘటనకు దారితీసిన కారణాలు,దాడి జరిగిన పరిస్థితులపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
