Homeఆదిలాబాద్Nirmal | గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై విచారణ జరపాలి

Nirmal | గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై విచారణ జరపాలి

  • నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలి

నిర్మల్(Nirmal) పట్టణంలో నిర్వహించబడుతున్న గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి నిజమైన గీతా కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్న గీతా పారిశ్రామిక సంఘంలో నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వకుండా వ్యాపారులకు ఉద్యోగులకు రాజకీయ నేతలకు బడా కాంట్రాక్టులకు సభ్యత్వం ఇచ్చి ఉపాధి కొల్లగొడుతున్నారని వారు ధ్వజమెత్తారు. దీనిపై సంబంధిత ఎక్సైజ్ అధికారులకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది విషయంపై కలెక్టర్ కూడా ప్రజా ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు ఈ గీత పారిశ్రామిక సంఘంలో పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా 11 విక్రయ కేంద్రాలు నిర్వహించవలసి ఉన్న 20 చోట్ల తెల్లగల్లు విక్రయాలు విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు. నిర్మల్ పట్టణంలో గీతా వృత్తిని నిర్వహించుకుంటూ ఏ ఆధారం లేని నిరుపేద గీతా కార్మికులకు, ఏ ఆధారం లేని కుటుంబ సభ్యులకు సభ్యత్వంలో అవకాశం కల్పించాలని దరఖాస్తు పెట్టుకున్న పారిశ్రామిక సంఘం ప్రతినిధులు వాటిని తిరస్కరించడం జరుగుతుందని తెలిపారు. నిర్మల్ పాత్రము క సంఘంలో ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైడు ఉద్యోగుల సభ్యత్వం తీసుకున్న పేర్లను పత్రిక ముఖంగా ప్రకటించారు.

- Advertisement -

ఈ అక్రమాలపై గీత కార్మికులు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. నిజమైన గీతా కార్మికులకు జరుగుతున్న అన్యాయాలు మాత్రమే తాము ఎత్తిచూపుతున్నామని వారికి న్యాయం చేస్తే బాగుంటుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై విచారం జరిపి చర్యలు చేపట్టని పక్షంలో వారం రోజుల్లో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుబుర్ర దేవేందర్ గౌడ్, గౌడ ఐక్య సాధన పోరాట సమితి స్టేట్ జనరల్ సెక్రెటరీ పొన్నం నారాయణ గౌడ్ గౌడ హక్కుల పోరాట సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, విశాల్ గౌడ్, పొన్నం శివాజీ గౌడ్ గౌడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News