Homeమెదక్‌Reunion | గుర్తుకొస్తున్నాయి..

Reunion | గుర్తుకొస్తున్నాయి..

  • 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే చోట కలయిక
  • పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  • ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరింపులు
  • విద్యా బుద్దులు నేర్పిన గురువులకు సన్మానాలు

జగదేవపూర్: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలోని పాఠశాలలో 2002_3 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం(Reunion) ఆదివారం రోజున ఉత్సాహంగా జరుపుకున్నారు. సుమారు 23 సంవత్సరాల తర్వాత పాత మిత్రులందరూ ఒకే చోట కలుసుకొని వారి వారి యోగక్షేమాలు తెలుసుకొని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వారు పాఠశాలలో చదువుకున్న సమయంలో చేసిన చిలిపి చేష్టలు కలిసి ఆడుకునే ఆటలు గుర్తు చేసుకుంటూ చదువుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడి 23 సంవత్సరాల తరువాత మళ్ళీ పాఠశాల ప్రాంగణంలో రాగానే ఒక్కసారిగా తమ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు సుగుణాకర్, మల్లయ్య, మధుసూదన్ ,వెంకటేశ్వర్లు, బాల నారాయణ ,తిరుపతి రెడ్డి, శివకుమార్, సురేందర్ రెడ్డి ,రాజు ,మహిపాల్ రెడ్డి, యాదవ రెడ్డిగురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలను నిర్వహిస్తూ పాఠశాలలో అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దర్గయ్య, రాచర్ల నరేష్, ఎల్లయ్య, రజనీకర్ రెడ్డి, నాచారం మహేందర్, తిరుపతి, స్వప్న ,నజ్మ ,ఉపేందర్, యాదగిరి, కృష్ణమూర్తి, మురళి, గౌరయ్య, కనక స్వామి తదితరులు(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News