మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో (Malla Reddy Pharmacy College) అంతర్జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ యాంటీబయోటిక్స్‌ను వైద్యుల సూచన లేకుండా వినియోగించడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందన్నారు.
అవసరం లేని సందర్భాల్లో యాంటీబయోటిక్స్ వాడటం వల్ల మందులకు బ్యాక్టీరియా లొంగని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు యాంటీబయోటిక్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వైద్యుల సలహా మేరకే యాంటీబయోటిక్స్ తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాశాల ఆధ్వర్యంలో వీధి నాటకాలు, కార్టూన్ ప్రదర్శనలు, అవగాహన ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీధర్ ,విద్యార్థులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)
