Homeమెదక్‌​Sadashivpet | శ్రీశైల పాతాళగంగలో పూజా పుష్పాలు, పత్రి నిమజ్జనం

​Sadashivpet | శ్రీశైల పాతాళగంగలో పూజా పుష్పాలు, పత్రి నిమజ్జనం

  • 43 ఏళ్ల ఆనవాయితీని ఘనంగా కొనసాగించిన భక్తులు
  • సదాశివపేట వీరశైవ లింగాయత్‌ సమాజం ఆధ్వర్యంలో పవిత్ర క్రతువు

సదాశివపేట: పవిత్ర శ్రావణమాసం సందర్భంగా సదాశివపేట(​Sadashivpet) పట్టణంలోని ప్రముఖ బసవేశ్వర మందిరంలో వెలసిన శివునికి, గణపతికి భక్తిశ్రద్ధలతో సమర్పించిన విశేష పూజా పుష్పాలు, పత్రిని శ్రీశైల క్షేత్రంలోని పుణ్యతీర్థమైన పాతాళగంగలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సదాశివపేట(​Sadashivpet) వీరశైవ లింగాయత్‌ సమాజం(Veerashaiva Lingayat Community) అధ్యక్షులు గందిగారాజు మాట్లాడుతూ.. గత పెద్దలు ఎంతో నిష్ఠతో ప్రారంభించిన సంప్రదాయాన్ని గత 43 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.

ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయంలో పూజలందుకున్న పవిత్ర పత్రి, పుష్పాలను భక్తిప్రపత్తులతో శ్రీశైలానికి తీసుకెళ్లి పాతాళగంగలో నిమజ్జనం చేసినట్లు వివరించారు. శ్రావణమాసంలో నిర్వహించే ఈ విశేష కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక భావనలతో పాటు పూర్వీకుల ఆచార సంప్రదాయాలను భావితరాలకు సజీవంగా అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

​హాజరైన ప్రముఖులు:

ఈ పవిత్ర కార్యక్రమంలో వీరశైవ లింగాయత్‌ సమాజ ప్రతినిధులు అమ్రాది రచన్న, వీరమహేందర్, రమేష్, రవి, సురేష్, వైద్య, వీరు, వినోద్, విశ్వనాథ్, నగేష్, శేఖర్, నగేష్, నర్సింలు, కిరణ్ వీరేందర్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News