Homeనిజామాబాద్‌Pocharam Srinivas Reddy | జర్నలిజం వృత్తి కత్తిమీద సాము లాంటిది

Pocharam Srinivas Reddy | జర్నలిజం వృత్తి కత్తిమీద సాము లాంటిది

  • రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు. బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • బాన్సువాడలో ఘనంగా ప్రారంభమైన జర్నలిస్టుల శిక్షణా తరగతులు

తాడ్వాయి: సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన జర్నలిజం వృత్తి కత్తిమీద సాము లాంటిదని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవారే జర్నలిస్టులని ఆయన కొనియాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు తప్పు చేసినా నిర్భయంగా ఎత్తిచూపే నైజం ఒక్క జర్నలిస్టులకే ఉంటుందన్నారు. సమాజంలో జరిగే పరిణామాలను, ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పత్రికారంగం అత్యంత పవిత్రమైనదని, విలువలతో కూడుకున్నదని స్పష్టం చేశారు.

- Advertisement -
Pocharam Srinivas Reddy Journalist Training Program Banswada1

అనంతరం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అందుకోసమే ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను స్వాగతిస్తూ, మార్కెట్‌లోకి వచ్చిన సరికొత్త ఏఐ (AI) టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ, సమాజ హితం కోసం వారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారని కొనియాడారు. కలం బలంతో దేశ రూపురేఖలను మార్చే శక్తి కేవలం మీడియాకే ఉందని, సమాజంలో జర్నలిస్టులు న్యాయమూర్తి (జుడీషియరీ) తరహా పాత్రను పోషిస్తారని వివరించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు రజినీకాంత్, మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల బాలరాజు, రిసోర్స్ పర్సన్లు (ఫ్యాకల్టీ) దిలీప్ రెడ్డి, గోవింద్ రెడ్డి, మార్కండేయతో పాటు నియోజకవర్గ పరిధిలోని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News