- పైపుల లీకేజీతో.. ప్రజా ధనం వృధా..!
- హెచఎండిఏ నిధులు.. ఎవరి జేబులోకి…!
- కాంట్రాక్టర్ల లోపమా..
- మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల తప్పిదమా!
- మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
- వెనుక ఆంతర్య మేమిటి!
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో (Bhongir Municipality) ఇంజనీరింగ్, హెచఎండిఏ ఇంజనీరింగ్ విభాగాల మధ్యన సమన్వయ లోపంతో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా మున్సి పాలిటీ పరిధిలో ఎక్కడ ఏ అభివృద్ధి నిధులు ఖర్చు చేస్తున్నారో తెలియని దుస్థితి భువనగిరి మున్సి పాలిటిది(Bhongir Municipality).మున్సి పాలిటీ సమగ్ర అభివృద్ధికి అలాగే వచ్చే ప్రధాన ఆర్థిక వన రులు ఇంటి పన్నులు, నల్ల బిల్లులు, వివిధ రూపంలో వచ్చే ట్యాక్సీలు ,నిర్మాణపు అనుమతులు తోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ప్రత్యేక నిధులను పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి.
నిధులు ఖర్చు చేసే ముందు టెండర్ ప్రక్రియ కౌన్సిల్ పూర్తి ఆమోదం తర్వాతనే డి పి ఆర్ టెండర్ అగ్రి మెంట్ అనంతరం పట్టణ అభివృద్ధి పనులు కొన సాగుతాయి. కానీ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ భువనగిరి మున్సిపాలిటీ హెచఎండిఏ పరిధిలో చేర్చడంతో సమస్య మొదలైంది. హెచఎండిఏ ప్రతి ఏటా కేటాయించే పట్టణ అభివృద్ధికి కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులను భువనగిరి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా నిధులు ఖర్చు చేయడమే ప్రధాన కారణ మని స్థానిక ప్రతి నిధులు పట్టణ పౌరులు ఆరో పిస్తున్నారు.
టెండర్ సాంకేతికంగా అలాగే స్థానికంగా మున్సిపాలిటీకి అధికారం లేకపోవడంతో హెచఎండిఏ పరిధిలోని నిధులు మంజూరు చేయడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఖర్చులు పెట్టడం వారి ఇష్టా రాజ్యాంగా మారింది. దీంతో హెచఎండిఏ అధి కారులు అభివృద్ధి పనుల్లో వాళ్ల ఇష్టాను సారంగా పనులు చేయడంతో స్థానిక అధికారులకు గానీ పట్టణ ప్రతినిధులకు గాని హెచఎండిఏ నుండి వచ్చిన నిధులు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు వంటి విషయాలు పారదర్శకంగా లేక పోవడం గమనార్హం. భువనగిరి మున్సిపాలిటీ 35 వార్డుల పరిధిలో ఎక్కడ హెచఎండిఏ నిధులతో చేసే పను లేవో… మున్సిపల్ నిధుల పనులు ఏవో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
అయితే ముఖ్యంగా ఈ నిధులలో కాంట్రా క్టర్ల లోపమా.. మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యమా.. అధికారుల తప్పిదమా.. అని పట్టణ పౌరులకు కనీసం హెచఎండిఏ అధికారులకు వివరాలు తెలుసు కో వాలని ఉన్న తెలియని పరిస్థితి మన భువనగిరి మున్సి పాలిటీ ది. అయితే , ముఖ్యంగా మున్సిపల్ అధికారుల సమన్వయం లేకపోవడం ఒకటైతే.. హెచఎండిఏ నిధులు అక్రమాలకు చోటు చేసుకొని నిధులు ఎవరి జోబు లోకి వెళు తున్నాయన్నది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న ప్రధానమైన ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భువనగిరి ఖిల్లాకు రూప్ వే తోపాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న మున్సి పాలిటీలో హెచఎండిఏ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయక పోవడం.. వల్లనే అక్రమార్కుల జేబు లోకి డబ్బులు వెళు తున్నాయన్నది నేడు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో చర్చనీ యాంశంగా మారింది.
అయితే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు తెలుసు కోవాలన్న అలాగే ఫిర్యాదులు చేయాలన్న హెచఎండిఏ ప్రాంతీయ కార్యాలయాలు ఇంజ నీరింగ్ విభాగాలు లేక పోవడంతోనే కాంట్రాక్టర్లు, మున్సిపాలిటీ అధికారుల వారి ఇష్టాను సారంగా నాణ్యత ప్రాధాన్యత లేని పనులను చేపట్టి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. ప్రజాధనం ఎవరి జేబులోకి పోతుందో తప్ప పట్టణ ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనలో పార దర్శకంగా నిర్వహించక పోవడంతో పట్టణ ప్రజలకు పలు అను మానాలు వ్యక్తమవు తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు లేని ప్రాధాన్యత లేని పనులు పట్టణంలో ఇక్కడ చూస్తే అక్కడే మన కళ్ళకు కట్టినట్లుగా దర్శన మిస్తున్నాయి.
మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఎంతో కష్టపడి చేసిన డ్రైనేజీ పనుల పైననే కేవలం నిధులు ఖర్చు చేయడానికే మీరు పనులు చేస్తున్నారా..? అని ప్రజల ముక్తకంఠంతో ఆరో పిస్తున్నారు. ఎక్కడలేని ఇంజనీరింగ్ విధానం మున్సిపాలిటీలో అమలు చేస్తూ ఇంజనీర్లకే మతి భ్రమించే విధంగా డబుల్ డెక్కర్ డ్రైనేజీలు..ప్రజా ధనం లీకేజీలు మట్టి పాలవుతున్నాయని, ఇప్పటికైనా స్థానిక ప్రతి నిధులు హెచఎండిఏ ఖర్చు చేసే నిధులకు ప్రజలకు జవాబు దారి తనం ఉండే విధంగా చూడాలని, హెచఎండీఏ నిధులు ఖర్చు చేయడంలో పారదర్శ కంగా ఉండే విధంగా హెచఎండిఏ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని భువనగిరి మున్సిపాలిటీ 35 వార్డుల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
