Homeఆదిలాబాద్Adilabad | డీజే, బ్యాండ్‌లపై పోలీసుల ఆంక్షలతో స్తంభించిన శోభాయాత్ర

Adilabad | డీజే, బ్యాండ్‌లపై పోలీసుల ఆంక్షలతో స్తంభించిన శోభాయాత్ర

శోభాయాత్రలో డీజేలు, బ్యాండ్ మేళాల సౌండ్లను పూర్తిగా నిలిపివేయాలని, శబ్దాలు లేకుండానే నిమజ్జనం చేసుకోవాలని పోలీసులు హుకుం జారీ చేయడంతో ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా శోభాయాత్రను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో పాటు శనివారం ఉదయం వేలాది మంది భక్తులు, స్థానికులు ఆదిలాబాద్‌లోని(Adilabad) ప్రధాన అంబేడ్కర్ చౌరస్తాకు తరలివచ్చి బైఠాయించారు. ప్రధాన రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్ల మేర వందలాది వినాయక విగ్రహాలు, వాహనాలు నిలిచిపోయి పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదు కిలోమీటర్ల మేర విగ్రహాలు నిలిచిపోవడం, అంబేడ్కర్ చౌక్ వద్ద వేలాది మంది గుమిగూడటంతో ఆదిలాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News