Homeహైదరాబాద్‌Hayathnagar | దుర్వాసన, ప్రమాదాలకు నిలయంగా హయత్ నగర్

Hayathnagar | దుర్వాసన, ప్రమాదాలకు నిలయంగా హయత్ నగర్

  • మధర్ డైరీ రోడ్డు

నిత్యం రద్దీ గా ఉండే హయత్ నగర్(Hayathnagar) నుండి కుంట్లూర్ వెళ్ళే మార్గం లో సబ్ స్టేషన్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల దగ్గర లోతయిన మోరీ చుట్టూ చెత్తా, పిచ్చిమొక్కలు ఉండడం వల్ల వాహన దారులు రోడ్డు గా భావించి నాలాలో పడి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు, GHMC వారు చిన్న బోర్డుతో సరిపెట్టారు కానీ నాలా చుట్టూ అడ్డుగోడ నిర్మించడం మరిచారాని,అందరూ బయట నుంచి వచ్చి చెత్త వేయడం వలన దుర్వాసన , దోమలు, బ్యాక్టీరియా ల తో ఎదురుగా ఉన్న కాలనీలో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, వై జంక్షన్ నుండి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వరకు తక్షణమే క్లీన్ చేయించి నాలా పై బ్రిడ్జి లేదా అడ్డుగోడ నిర్మించాలని కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News