- ఆదివాసి అడ్డాలో సామాజిక చర్చ
- చాప కింద నీరులా విస్తరిస్తున్న రచ్చ
- ఒక్క వ్యక్తి “చేతి”లోనే పార్టీ అంతా
- గిరిజన నేతల్లో నిరసనప్రాధాన్యత దక్కడం లేదనే భావన
- ఎన్నికల వరకే ఆదివాసీ.. ఆ తర్వాత ఏరిపారేసి
- ప్రశ్నిస్తే పరేషాన్
- పక్కన పెట్టేసే ప్రయత్నం
- అధికార పార్టీలో అతనే అంతా
- ఆదివాసీ నేతలకు అంతగా దక్కని ప్రాధాన్యత
- మంత్రి సైతం ఆయన వైపే
- జిల్లా మొత్తం ఆయన చేతుల్లోనే
- గిరిజన జిల్లాపై గిరిజనేతర పెత్తనం ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏజెన్సీ జిల్లాలో సామాజిక రచ్చ చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ ఓట్లే గెలుపుకు కీలకంగా ఉన్న ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ పగ్గాలు మాత్రం గిరిజనేతరుడు చేతుల్లో ఉండడం ఆదివాసీ నేతల్లో నిరసనకు కారణం అవుతుంది. కాకపోతే బడా సామాజిక వర్గానికి చెందిన ఆ నేతకి అక్కడ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆదివాసీ అడ్డాలో వారి ప్రాధాన్యత మొక్కుబడి తంతుగా మారింది. జిల్లాలో గిరిజనేతర నాయకుడే మంత్రితో సమానంగా ఓ సందర్భంలో మంత్రి కంటే ఎక్కువగా చలామణి అవుతున్న పరిస్థితులను చూస్తూ గిరిజన నేతల్లో అసహనం చాప కింద నీరులా పెరుగుతూ వస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో నే ఒక ముఖ్యమైన మంత్రికి సంబంధించిన నియోజకవర్గం లో ఒక సామాజిక రచ్చ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఆ మంత్రి ఇలా కాలో అధికార పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్య తలను ఓ గిరిజననేతర నేత నిర్వర్తిస్తున్న నేపథ్యంలో పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన ఆ నియోజకవర్గంలో ఆదివాసీ నేతలు కొంత అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఓ డి సి సి అధ్యక్షుడు మంత్రితో సమానం గా అంతకు మించి కూడా వ్యవహారాలు సాగించడం ఆ ఒక్క జిల్లాలోనే సాగుతుండడంతో సహజంగానే గిరిజన నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఆ జిల్లాలో మంత్రికి అత్యంత సన్నిహితుడుగా చలామణి అవుతున్న డిసిసి అధ్యక్షుడు ఏది చెప్తే అదే నడిచే పరిస్థితి నెలకొనడం సహజంగానే ఆదివాసీ నాయకుల్లో నిరుత్సాహానికి కారణమవుతుంది.Tribal Concerns
జిల్లా అధ్యక్షుడు మంత్రికి అత్యంత సన్నిహితులు కావడంతో తమ నిరసనలు అసంతృప్తి బహిరంగంగా వెళ్లగక్కే అవకాశాలు లేకపోవడంతో ఎక్కడైనా సందర్భం దొరికినప్పుడు ఆదివాసీ నేతల్లో ఈ చర్చ సాగుతోంది. ఇది చాప కింద నీరులా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ జిల్లాలో అధికార పార్టీ పగ్గాలు గిరిజనేతరుడి చేతిలో ఉండడం ఆయన దాదాపు మంత్రి స్థాయి ప్రోటోకాల్ అనుభవించడం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం ఆయన చెప్పినట్లు చేయడం లాంటి పరిణామాలు జిల్లాలోని కీలకమైన సామాజిక సేవలు చేసే ప్రజా సంబంధాలు కలిగిన గిరిజన నాయకులకు మాత్రం మింగుడు పడడం లేదనేది వాస్తవిక పరిస్థితి.
ఇదే సందర్భంలో గిరిజన ఇతర పెద్ద మాఫియా కార్యక్రమాల్లో సైతం భాగస్వామ్యం అవుతూ ఓ రకంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చి పెట్టారనేది అధికార పార్టీకి చెందిన నిజమైన స్వచ్ఛమైన పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నప్పటికీ కేవలం మంత్రి అండదండలు ఉండడం వల్లే ఆయనకు ఎదురు చెప్పే పరిస్థితి అటు జనాల్లోనూ ఇటు పార్టీలోనూ లేదనేది చర్చినీయాంశంగా మారింది. ఆ అధ్యక్షుడి కార్యకలాపాల వల్ల పార్టీకి ఇప్పటికే నష్టం జరిగిపోయిందనే భావన క్షేత్రస్థాయి నుండి వస్తున్నప్పటికీ పార్టీ పెద్దలు పట్టించుకునే పరిస్థితి లేదు.Tribal Concerns
జిల్లాలో ఆదివాసీ నేతల ప్రాబల్యం ప్రాముఖ్యత తగ్గుతున్న నేపథ్యంలో పాత తరం అధికార పార్టీ నేతలు ఇప్పటికే కాంగ్రెస్కు దూరమయ్యారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో పెద్ద సామాజిక వర్గ నేతలకు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అక్కడి మంత్రి విస్తృతమైన ప్రాధాన్యత ఇస్తుండడం భవిష్యత్ రాజకీయాల్లో అధికార పార్టీకి నష్టం తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయనే ఆవేదన గ్రామస్థాయి క్యాడర్లో నెలకొంది.. ఆ జిల్లాలో ప్రవేట్ సైన్యం సోషల్ మీడియా లాంటివి అడ్డుపెట్టుకొని సత్య దూరమైన ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పెద్దలు పబ్బం గడిపేస్తున్నారని పైరవీలు కాంట్రాక్ట్ పనులు వంటి స్వప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టి వాటిని నెరవేర్చుకునే దిశగా అధికారులు ఉపయో గించుకోవడం చర్చనీయాంశంగా మారింది
.
జిల్లాలో మంత్రి కంటే ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ లు డిసిసి ప్రెసిడెంట్ మాటే వింటారు అనే ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లడంతో ఆయనో మోనార్క్ ఐ పోయారు.. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో గిరిజన నాయకుల్లో ఒక రకమైన నైరాశ్యం నెలకొని చాప కింద నీరులా అది పార్టీకి వ్యతిరేకంగా పరిణమించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్త మవు తున్నాయి నివురు గప్పిన నిప్పులా గిరిజన నాయకుల్లో నెలకొని ఉన్న ఈ అసంతృప్తి చాయాలపై ఆ ఏరియా మంత్రి దృష్టి పెట్టి ప్రక్షాళన చర్యలు చేపట్టకపోతే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయనే చర్చలు తీవ్రంగానే ఉన్నాయి.. ఎవరా మంత్రి డిసిసి అధ్యక్షులు అనే ఆలోచించుకునే లోపే సోషల్ మీడియా ద్వారా వాళ్లే భుజాలు తడుముకునేందుకు ముందుకు వస్తారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
