Homeనల్లగొండArrangements | వినాయక నిమజ్జనానికి పకడ్బంది భద్రత ఏర్పాట్లు

Arrangements | వినాయక నిమజ్జనానికి పకడ్బంది భద్రత ఏర్పాట్లు

  • భక్తుల భద్రతకే తొలి ప్రాధాన్యత…
  • ట్రాఫిక్,పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి…
  • సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి గ్రామంలో కృష్ణా నది వద్ద ఏర్పాటు చేసిన వినాయక్ నిమజ్జన ఘాట్ ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు,రెవెన్యూ,ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి నిమజ్జన ఘాట్‌ వద్ద చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుధవారం నాడు వినాయక నిమజ్జనానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.Arrangements

నిమజ్జన ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల ప్రవేశం,ఎగ్జిట్ మార్గాలను క్రమబద్ధీకరించాలని సూచించారు.నిమజ్జనానికి వచ్చే వాహనాలను నిర్ణీత మార్గాల్లోనే అనుమతిస్తూ, భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ను నియంత్రించాలని తెలిపారు. కృష్ణా నదిలో నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, నది పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు ప్రమాదకర ప్రాంతాల్లోకి, లోతైన నీటిలోకి వెళ్లకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.Arrangements

- Advertisement -

నిమజ్జన ప్రదేశంలో బారికేడింగ్, లైటింగ్,భద్రతా సిబ్బంది, అత్యవసర సేవలు,వైద్య సహాయం,గజ ఈతగాళ్లు తదితర రక్షణ చర్యలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో సహకరించాలని, నది వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ నరసింహ కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు,కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి,హుజూర్ నగర్ సీఐ చరమందరాజు, మత్స్యాధికారీ,మండల తహసీల్దార్ హిమ బిందు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, హుజూర్ నగర్ ఎస్సై నరేష్, యంపిఓ నవీన్,సూపరిడెంట్ కృష్ణవేణి, ఆర్ఐ శివ, మట్టపల్లి సర్పంచ్ రామిశెట్టి విజయ శాంతి అప్పారావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ జిపిఓ ప్రకాశ్, సాగర్, నాగార్జున సిమెంట్ పరిశ్రమ అధికారులు, పోలీసు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News