Homeమహబూబ్‌నగర్‌Kadthal | కడ్తాల్‌ ప్రజావాణిలో అధికారుల కరువు!

Kadthal | కడ్తాల్‌ ప్రజావాణిలో అధికారుల కరువు!

  • ఉదయం 11 దాటినా కార్యాలయాల్లో కనిపించని పలువురు అధికారులు..
  • ప్రజల ఫిర్యాదులకు స్పందించేదెవరు?

ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల హాజరు ప్రశ్నార్థకంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల(Kadthal Mandal) కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఉదయం 11 గంటలు దాటినా పలు శాఖలకు చెందిన అధికారులు సమయానికి హాజరుకాలేదని ప్రజలు వాపోతున్నారు.

తమ సమస్యలు చెప్పుకునేందుకు దూర ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చిన ప్రజలకు సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురవుతున్న పరిస్థితి కనిపించింది.ఒకవైపు ప్రజావాణి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటామని అధికారులు చెబుతున్నప్పటికీ,మరోవైపు కీలక శాఖల అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

- Advertisement -

సమస్య చెప్పుకోవాలంటే అధికారి ఎక్కడ?

విద్య,ఉపాధి,ఇరిగేషన్,మిషన్ భగీరథ,గృహ నిర్మాణ,మహిళా శిశు సంక్షేమ,విద్యుత్
తదితర సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు ప్రజలు ప్రజావాణికి వస్తున్నారు.అయితే సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోతే తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది.ప్రజావాణి నిర్వహణ కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా,ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే వేదికగా మారాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సమయపాలనపై పర్యవేక్షణ ఏదీ?

ప్రజావాణికి అధికారులు నిర్ణీత సమయానికి హాజరవుతున్నారా? హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా? ప్రజలు వేచి ఉండకుండా శాఖల వారీగా ఫిర్యాదులు స్వీకరించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ప్రజావాణి రోజున అన్ని శాఖల అధికారులు సమయానికి అందుబాటులో ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి,ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News