- తరాల నాటి పెండింగ్ కేసులకు చెక్ పెడుతుందా..?
- అసలు అడ్డంకులేంటి? పరిష్కార మార్గాలేంటి?
- ఎం ప్యానల్డ్ మీడియేటర్,కౌన్సిలేటర్‌గా న్యాయవాది డా. నందిమండలం వేణు..
భారత న్యాయ చరిత్రలో ఒక చారిత్రక అడుగు పడింది.. దఃశాబ్దాలుగా పేరుకుపోయిన కేసులను సత్వరమే పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.. భారత మధ్య వర్తిత్వ మండలి ఏర్పాటు చేసింది.. న్యాయం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసే వారికి ఇక తగిన న్యాయం చేకూరుతుందని మేధావులు అంటు న్నారు.. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు, ఎం ప్యానల్డ్ మీడియేటర్, కౌన్సిలేటర్ గా ప్రఖ్యాత హై కోర్టు న్యాయవాది డా. నందిమండలం వేణును నియమించారు..
మధ్యవర్తిత్వ చట్టం-2023 ప్రకారం భారత మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు(India Mediation Council) చేయడం ముదావహం.. దేశవ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో వున్నా యి.. అందులో 83శాతం కేసులు దిగువ కోర్టుల్లోనే ఉండిపోవడం గమనార్హం.. ప్రస్తుతా నికి 2.5 లక్షలు అవసరం కాగా.. ప్రస్తుతం ఉన్నది కేవలం 5శాతం మాత్రమే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యల ప్రకారం 1.68 కోట్ల అర్హత గల కేసులు వున్నాయి..
న్యాయయజ్ఞంలో మైలురాయి : కోర్టు మెట్లెక్కితే తరాలు గడిచిపోతాయి.. న్యాయం అందేసరికి ప్రాణం పోతుంది.. కక్షిదారుల సమయం, డబ్బు నీళ్లప్రాయ మవుతాయి. ఈ దురవస్థకు చరమగీతం పాడుతూ, భారతీయ న్యాయ వ్యవస్థలో గుణాత్మక మార్పునకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మధ్యవర్తిత్వ చట్టం – 2023 అమలులోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత, పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు ‘భారత మధ్యవర్తిత్వ మండలి ’(India Mediation Council) ఏర్పాటుకు కేంద్ర న్యాయ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎంసీఐ బాధ్యతలు ఇవే : సంస్థాగత వివాద పరిష్కా రాల నియం త్రణ, ప్రచారం. మధ్యవర్తిత్వ సేవలంది స్తున్న సంస్థల గుర్తింపు, పర్యవేక్షణ. మీడియేటర్ల రిజిస్ట్రేషన్, అర్హతా ప్రమాణాలు, శిక్షణా విధానాల రూపకల్పన. ఆన్‌లైన్ మీడియేషన్ నిబంధనల ఖరారు.
సవాళ్లు – పరిష్కార మార్గాలు : మండలి ఏర్పాటు హర్షణీయమే అయినా, ఆచరణలో విజయం సాధించాలంటే ఈ క్రింది సవాళ్ల ను అధిగమించాలి : మీడియేటర్ల కొరత పూర్తిస్థాయి సభ్యుల నియామకం, దేశవ్యాప్తంగా శిక్షణా కేంద్రాల విస్తరణ. సివిల్, వాణిజ్య కేసుల్లో కోర్టుకు వెళ్లే ముందే ముందస్తు మధ్యవర్తిత్వం తప్పనిసరి చేయాలి. అదేవిధంగా బలవంతపు రాజీలు / పక్షపాతం, ధన, అధికార బలంతో బలహీనులను లొంగదీసు కోకుండా పటిష్ట పర్యవేక్షణ, స్వచ్ఛందతకు భరోసా ఇవ్వాలి.
అంతర్జాతీయ ప్రమాణాలు: క్రాస్-బోర్డర్ డిస్ప్యూట్స్ పరిష్కారానికి గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడం, ఒప్పందాలకు చట్టబద్ధ రక్షణ. హేయమైన నేరాలు, ప్రజాప్రయోజన ద్రోహ కేసులను రాజీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించడం. నగరాలకే పరిమితం కాకుండా జిల్లా స్థాయి వరకు మీడియేషన్ కేంద్రాలను విస్తరించినప్పుడే నిజమైన ‘సత్వర, సులభతర న్యాయం’ సాకారమవుతుంది. ఎంసీఐ కేవలం ఒక కాగితపు వ్యవస్థగా మిగిలిపోకుండా, నిబద్ధతతో పనిచేస్తే భారత న్యాయ చరిత్రలో ఇది స్వర్ణాధ్యాయం అవుతుంది.
భారత మధ్యవర్తిత్వ మండలి ఉద్దేశ్యాలు : భారత మధ్యవర్తిత్వ మండలి అనేది దేశంలో మధ్యవర్తిత్వ సంస్కృతిని ప్రోత్స హించడానికి, మధ్యవర్తుల శిక్షణకు, మధ్యవర్తిత్వ సంస్థల గ్రేడింగ్/రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్రతిపాదిత/కేంద్ర చట్టబద్ధమైన సంస్థ.
ముఖ్య ఉద్దేశాలు – విధులు : ప్రమాణాల రూపకల్పన : మధ్యవర్తిత్వ నిపుణులు, సంస్థలకు నైతిక ప్రమాణాలు, శిక్షణా విధానాలను నిర్దేశించడం.
రిజిస్ట్రేషన్ : మధ్యవర్తులు, మధ్యవర్తిత్వ సేవా ప్రదాతలు, ఇన్‌స్టిట్యూట్‌లను నమోదు చేయడం.
మౌలిక సదుపాయాలు : దేశవ్యాప్తంగా మధ్యవర్తిత్వ కేంద్రాలను అభివృద్ధి చేయడం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాన్ని పటిష్టం చేయడం.
విధాన రూపకల్పన : ప్రభుత్వానికి, సంబంధిత వర్గాలకు మధ్య వర్తిత్వ చట్టాలపై సలహాలుఇవ్వడం. నేపథ్యం – చట్టపరమైన ఆధారం
మధ్యవర్తిత్వ చట్టం, 2023 : ఈ చట్టం కింద భారత మధ్యవర్తిత్వ మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోర్టులపై భారాన్ని తగ్గించి, కోర్టుకు వెళ్లకుండానే రాజీ మార్గాల ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరించడం దీని ప్రధాన లక్ష్యం. కాగా తనను భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు, ఎం ప్యానల్డ్ మీడియేటర్, కౌన్సిలేటర్‌గా నియమించినందుకు న్యాయవాది డా. నందిమండలం వేణు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ క్రమంలో న్యాయస్థానాలకు ఒత్తిడి తగ్గించే నేపథ్యంలో తాను చిత్తశుద్ధితో కృషి చేస్తానని, ఈ విషయంలో తనను సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
