Homeమెదక్‌Chinta Prabhakar | కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం

Chinta Prabhakar | కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

  • ​రూ.15 వేల కోట్లకు పైగా నిధులు, 10 శాతానికి రిజర్వేషన్లు పెంపు
  • కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన గిరిజనులు
  • ​కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నల వర్షం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే గిరిజనుల సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(Chinta Prabhakar) పేర్కొన్నారు. కొండాపూర్ మండలం శివన్నగూడెం తండా, తమ్ములి భాయ్ తండాల్లో పార్టీ నాయకులు, గిరిజనులతో కలిసి ఆయన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

- Advertisement -

​బీఆర్‌ఎస్ పాలనలో సాధించిన ప్రగతి:

​భారీగా నిధులు: ఎస్టీల అభివృద్ధి కోసం ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (STSDF) చట్టం తెచ్చి, 2022-23లో ₹13,412.63 కోట్లు, 2023-24లో ₹15,232.62 కోట్లు కేటాయించారు.

​రిజర్వేషన్లు: ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి సామాజిక న్యాయం చేకూర్చారు.
​గిరి వికాసం: బంజరు, పోడు భూములను సాగులోకి తెచ్చి, 19,698 మంది రైతులకు చెందిన 56,613 ఎకరాల భూమికి సాగు భరోసా కల్పించారు.

​విద్య, మౌలిక వసతులు: రాష్ట్రవ్యాప్తంగా 71 ప్రత్యేక గురుకులాల ఏర్పాటుతో పాటు తండాలలో రోడ్లు, తాగునీటి కోసం STSDF ద్వారా ₹1,000 కోట్లు ఖర్చు చేశారు.

​ఉపాధి: ఎస్టీ యువత కోసం ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలు, మహిళల కోసం ‘WE HUB’ ద్వారా శిక్షణ అందించారు.

​కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?:

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన ట్రైబల్ కార్పొరేషన్లు, ITDAల ఏర్పాటు, సమగ్ర గిరిజన అభివృద్ధి పథకం, ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం కాకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News