- భిన్నత్వంలో ఏకత్వమే భారతీయతకు అసలైన బలం
- సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం
- మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్(Chinta Prabhakar) పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(Chinta Prabhakar) మాట్లాడుతూ.. దేశ సమగ్రత, స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి అసలైన బలమని, కుల, మత, ప్రాంత, భాషా విభేదాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందడుగు వేసినప్పుడే దేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజంలో శతాబ్దాలుగా విరాజిల్లుతున్న సోదరభావం, శాంతిసామరస్యాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు విరల్, చక్రపాణి, రామప్పలతో పాటు పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
