- దంపతుల ఆ*త్మహ*త్య
- ఇంట్లో విషం త్రాగి భార్య
- రైల్ కింద పడి భర్త ఆ*త్మహ*త్య
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భార్యాభర్తలు ఆ*త్మహ*త్య చేసుకొని మృతి(Couple Suic*de Case,) చెందిన విషాద ఘటన గురువారం ఉదయం లాలగూడా పోలీస్ స్టేషన్(Lalaguda Police Station,) పరిధిలో చోటు చేసుకుంది. నాచారంలో ఫుట్ పాత్ పైన టీ స్టాల్ నిర్వహిస్తున్న కర్ణాటక కు చెందిన చరణప్పకు, లక్ష్మీ అనే మహిళతో 15నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుండి విజయపురి కాలనీలో దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం భర్త నిద్రలో నుండి లేచి చూడగా భార్య మృతి చెంది ఉండడంతో భయంతో ఇంట్లో నుండి బయటకు వచ్చి లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆ*త్మహ*త్యకు పాల్పడ్డాడు.
ఇంటికి చేరుకున్న లాలగూడా(Lalaguda) పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి తరలించారు. పురుగుల మందు త్రాగి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అదే విధంగా లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్దకు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు చేరుకొని చరణప్ప మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు.
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారని, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ*త్మహ*త్యకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు లాలగూడా పోలీసులు, సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
