HomeతెలంగాణMahesh Kumar Goud | కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం..

Mahesh Kumar Goud | కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం..

  • ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి..
  • కేసీఆర్ కు సీఎం తర్వాత అంతటి భద్రత కల్పిస్తున్నాం..
  • వెల్లడించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో గౌరవం.. ఆయన నిండునూరేళ్ళు ఆరోగ్యంగా వుండాలని అభిలషించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..(Mahesh Kumar Goud) కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాం.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు సీఎం తర్వాత అంతటి భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రతిపక్ష నేతలను గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది.. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ చెడు కోరుకోలేదు.. కాంగ్రెస్ సంస్కృతికి వాజ్‌పేయి, జైపాల్ రెడ్డి ఉదాహరణలు..

వాజ్‌పేయి ఆరోగ్యం బాగోలేకపోతే అమెరికాకు పంపించి చికిత్స చేయించిన చరిత్ర కాంగ్రెస్‌ది.. జైపాల్ రెడ్డికి బైపాస్ సర్జరీ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిపడితే గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం.. అసెంబ్లీకి కేసీఆర్ అరుదుగా హాజరయ్యారు.. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష విషయంలో కాంగ్రెస్ కుటుంబం మానవతా దృక్పథాన్ని చూపింది.. కేసీఆర్ ఆరోగ్యం విషయంలో కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడం సరికాదు.. మీ ఇంటి సమస్యను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం ఎంతవరకు న్యాయం?(epaper.aadabhyderabad.in)

- Advertisement -

సాక్షాత్తు ముఖ్యమంత్రికి పిండప్రదానం చేయడం ఎంతవరకు సబబు? ఇలాంటి రాజకీయ సంస్కృతి మంచిది కాదు.. హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారన్న ఆరోపణలపై ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు.. క్షుద్ర పూజల ఆరోపణలపై హరీష్ రావు వివరణ ఇవ్వాలి..
తాత మధు చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం.. కేసీఆర్ ఆరోగ్యం చెడిపోవాలని హరీష్ రావు క్షుద్ర పూజలు చేయించారన్న కవిత వ్యాఖ్యలను పరిశీలించాలి.. కవిత వ్యాఖ్యల వీడియో బైట్‌ను ప్రస్తావించారు మహేష్ కుమార్ గౌడ్..(Mahesh Kumar Goud) దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని వివరించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News