Homeఆంధ్రప్రదేశ్Elections | ఏపీలో స్థానిక ఎన్నికలకు సిద్ధం..

Elections | ఏపీలో స్థానిక ఎన్నికలకు సిద్ధం..

  • వడివడిగా అడుగులు వేస్తున్న ఎన్నికల సంఘం..
  • పూర్తి స్థాయి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల(Elections) నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం వడివడిగా అడుగులు వేస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఫొటోలతో కూడిన పూర్తిస్థాయి ఓటర్ల జాబితాలను తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.(epaper.aadabhyderabad.in)

ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలు :
సెప్టెంబర్ 11: ఫొటో సహిత ఓటర్ల జాబితాల ప్రదర్శన
సెప్టెంబర్ 14: పోలింగ్ కేంద్రాల ముసాయిదా (Draft) జాబితా రూపకల్పన
సెప్టెంబర్ 15: పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అధికారిక ప్రచురణ
సెప్టెంబర్ 15, 16: పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, మార్పులు-చేర్పుల వినతుల స్వీకరణ
సెప్టెంబర్ 16: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ అధికారుల సమన్వయ సమావేశం
సెప్టెంబర్ 18: పోలింగ్ స్టేషన్ల జాబితాకు జిల్లా కలెక్టర్ల ఆమోదం
సెప్టెంబర్ 19: ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ.

- Advertisement -
RELATED ARTICLES

Latest News