కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం(EVM Warehouse) కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) తనిఖీ(Inspection) చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. చేశారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.(epaper.aadabhyderabad.in)


ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు గండ్రత్ రమేష్, సిరికొండ రమేష్, మజార్, ముజాహిద్ శ్రావణ్, అజార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
