Homeరంగారెడ్డిProtest | మహిళా ఎమ్మెల్యేలను మెడ పట్టి అవమానిస్తారా.?

Protest | మహిళా ఎమ్మెల్యేలను మెడ పట్టి అవమానిస్తారా.?

  • సీఎం సొంత జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం.
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు.
  • సీఎం రేవంత్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మల దహనం.
  • కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అనిల్.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మహిళా ఎమ్మెల్యేలను సైతం చూడకుండా మెడ పట్టి అవమానించే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని బీఆర్‌ఎస్ వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ అనిల్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వకుండా అణిచివేతకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను నిరసిస్తూ(Protest) అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్ రైల్వే ఫ్లైఓవర్‌పై సీఎం రేవంత్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే పాయల శంకర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో ఫ్లైఓవర్‌పై సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది.(aadabhyderabad.in) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News