- దళిత స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరినీ వెంటనే బర్తరప్ చేయాలి…!
- తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సంజీవులు…!
ఫామ్ హౌస్ పండేటోనికి జీతం ఎందుకని, అయనకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏం తెలుస్తుందని, తాడ్వాయి మండలం(Tadwai Mandal) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు(Congress Leader Bandari Sanjeevulu) అన్నారు. అయన మంగళవారం తాడ్వాయి మండల కేంద్రంలో పార్టీ ఆదేశానుసారం మండల కేంద్రంలో స్పీకర్ పై బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్,చేసిన అనుచిత వ్యాఖ్యలకు, నిరసనగా తాడ్వాయి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులపై నిప్పులు రేగారు. ఫామ్ హౌస్ లో పండే వాళ్లకు జీతం అవసరమా,(aadabhyderabad.in) ఇప్పటికీ వరకు 21 కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని కేసీఆర్ ఉపయోగించుకున్నాడని, ప్రజాక్షేత్రంలో లేని నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏం తెలుస్తుందని, ప్రజాక్షేత్రం లో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడాలని అయన కెసిఆర్ కు హితువు పలికారు.
తాత మధు, నవీన్ కుమార్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారిని వెంటనే పదవుల నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ, షౌకత్, రాజీవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గైని రాజలింగం, రంజిత్ రెడ్డి, సుధాకర్ రావు, వెంకట్ రెడ్డి, పులీ ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
