Homeఅంతర్జాతీయంIllegal Electricity | అక్రమ నిర్మాణానికి అధికారుల పవర్

Illegal Electricity | అక్రమ నిర్మాణానికి అధికారుల పవర్

  • ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని భవనానికి 12 విద్యుత్ సర్వీసులు..
  • 100 కేవీఏ సామర్థ్యం గల రెండు ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు..
  • అక్రమ నిర్మాణానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంపై అనుమానాలు..
  • ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలు వెల్లడించాలని ప్రజల డిమాండ్

తెలంగాణలో విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేస్తామని, నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అధికారుల అక్రమ ప్రయోజనాల కోసం నిబంధనలను బూటకంగా మారుస్తున్నారు. ఇందుకు నిదర్శనమే శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నల్లగండ్లలో వెలుగు చూసిన అత్యంత వివాదాస్పద ఉదంతం.

అసలు ఎలాంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (భవన నిర్మాణ పూర్తి ధ్రువీకరణ పత్రం) లేని ఒక అక్రమ భవన సముదాయానికి ఏకంగా 12 విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు,(Illegal Electricity) అదీ కాకుండా ఏకంగా 100 కిలో వోల్ట్ ఆంపియర్స్ (కేవీ) సామర్థ్యం గల రెండు భారీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న విద్యుత్ శాఖ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

- Advertisement -

అనుమానాల నడుమ 12 సర్వీస్ నంబర్లు.. : నల్లగండ్ల పరిధిలోని ఒక వివాదాస్పద భవన నిర్మాణ తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. రెండు వేర్వేరు భవనాలను కలిపి ఒకే ఫార్మాట్‌లో చూపించడం, అనుమతించిన(aadabhyderabad.in) అంతస్తులకు మించి అదనంగా అంతస్తులను నిర్మించడం, నివాస (రెసిడెన్షియల్) అనుమతులు పొంది వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు భవనాన్ని వాడుతుండటం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ?

ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణానికి నల్లగండ్ల సహాయ ఇంజనీర్ (ఏఈ) కార్యాలయం మరియు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ), గచ్చిబౌలి పరిధిలో ఏకంగా 12 విద్యుత్ సర్వీస్ కనెక్షన్లు ఎలా మంజూరయ్యాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం కింది ప్రత్యేక సర్వీస్ నంబర్లు నమోదై ఉన్నాయి : 115413621, 115413622, 115413623, 115413624, 115413625, 115413626, 115413628, 115413629, 115413630, 115413631, 115413632, 115413633, (కాగా, వీటిలో 115413627 నంబర్ మినహాయించబడటం గమనార్హం).

సమాచారం ఇవ్వడానికి సబ్ ఇంజనీర్ కిశోర్ భయం ఎందుకు? : అక్రమ నిర్మాణానికి విద్యుత్ కనెక్షన్ల మంజూరుపై అసలు నిజాలు బయటపడకుండా సిబ్బంది తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదాస్పద సర్వీస్ కనెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు కోరగా, సంబంధిత సబ్ ఇంజనీర్ కిశోర్ కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారంటే, ఈ అక్రమ తంతు వెనుక ఎంతటి పెద్దల హస్తం ఉందో సహజంగానే అర్థం చేసుకోవచ్చు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అధికారులే ఇలా సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుండటం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

టీజీఎస్‌పీడీసీఎల్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన – స్పష్టమైన నిబంధనలు ఇవే: తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్‌పీడీసీఎల్) నిబంధనల ప్రకారం ఎలాంటి భవనానికైనా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ మంజూరు చేయాలంటే కింది మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా పంచాయతీ జారీ చేసిన ఆమోదించబడిన భవన ప్లాన్ మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) లేకుండా ఏ భవనానికి కూడా శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడానికి వీల్లేదు.

కానీ ఇక్కడ సరైన పత్రాలు లేకుండానే భారీగా సర్వీసులు ఇవ్వడం నిబంధనల తీవ్ర ఉల్లంఘన కిందకు వస్తుంది. మున్సిపల్ అనుమతులు లేని అదనపు (అధికారిక అనుమతి లేని) అంతస్తులకు లేదా నిబంధనల ఉల్లంఘనలు (డీవియేషన్స్) ఉన్న భాగాలకు విద్యుత్ సరఫరా ఇవ్వకూడదని ఎస్పీడీసీఎల్ స్పష్టమైన రూల్స్ ఉన్నాయి.

నివాస అనుమతి పొంది, ఆ స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటే దానికి వాణిజ్య కేటగిరీ కింద మాత్రమే, అది కూడా వాణిజ్య అనుమతులు ఉంటేనే సర్వీస్ ఇవ్వాలి. కానీ నివాస అనుమతులతో వాణిజ్య అవసరాలకు విద్యుత్ ఇవ్వడం చట్టవిరుద్ధం. లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సమర్పించిన వైరింగ్ టెస్ట్ రిపోర్ట్‌తో పాటు, ఏఈ స్థాయి అధికారి స్వయంగా సైట్‌ను సందర్శించి భవనం చట్టబద్ధమైనదేనా అని నిర్ధారించుకున్న తరువాతే మీటర్ బిగించాలి. ఇక్కడ ఈ తనిఖీలు నామమాత్రంగా మారినట్లు స్పష్టమవుతోంది.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకున్నా కేటగిరీ-8 కింద సర్వీసులు ఇవ్వొచ్చా? : టీజీఎస్‌పీడీసీఎల్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్లై (జీటీసీఎస్) మరియు టారిఫ్ నిబంధనల ప్రకారం కేటగిరీ-8 అనేది కేవలం తాత్కాలిక అవసరాల కోసం (ఉదాహరణకు: భవన నిర్మాణ సమయంలో పనుల నిమిత్తం, పందిళ్లు, ఉత్సవాలు వంటి తాత్కాలిక కార్యక్రమాలకు) మాత్రమే వర్తిస్తుంది. ?నిర్మాణం జరుగుతున్న కాలంలో యంత్రాల వాడకం కోసం తాత్కాలిక కనెక్షన్ తీసుకోవచ్చు.

కానీ నిర్మాణం పూర్తయిన తర్వాత లేదా ఎలాంటి అనుమతులు చేతిలో లేని పక్షంలో శాశ్వత సర్వీసులుగా మార్చాలన్నా, లేదా భారీ ఎత్తున సర్వీసులు పొందాలన్నా మున్సిపల్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) విధిగా ఉండాలి. ?ఒక భవనం నివాసయోగ్యంగా మారిందని, అన్ని మున్సిపల్ నిబంధనల ప్రకారమే నిర్మించారని స్థానిక సంస్థలు ధ్రువీకరిస్తూ ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట’ ఇస్తేనే డిస్కం శాశ్వత విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలి. ఓసీ లేని భవనానికి నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని సర్వీసులు కేటాయించడం చట్టవిరుద్ధం.

100 కిలో వోల్ట్ ఆంపియర్స్ (కేవీ) ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుపై చెలరేగుతున్న విమర్శలు..: సాధారణంగా ఒక సాధారణ నివాస లేదా చిన్నపాటి నిర్మాణానికి అంత భారీ స్థాయిలో లోడ్ అవసరం ఉండదు. కానీ ఎలాంటి అధికారిక ఆమోదాలు, ఓసీ లేని ఆ భవన సముదాయానికి ఏకంగా 100 కిలో వోల్ట్ ఆంపియర్స్ (కేవీ) చొప్పున రెండు భారీ ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయడంపై ఇంజనీరింగ్ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం వినియోగదారుడు సమర్పించిన ఆమోదించబడిన ప్లాన్, లోడ్ అంచనా (లోడ్ కాలిక్యులేషన్), మరియు లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రా క్టర్ వైరింగ్ సర్టిఫై చేసిన తర్వాతే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సాధ్య సాధ్యాలు (ఫీజిబిలిటీ) పరిశీలించబడతాయి. ఎలాంటి మున్సిపల్ అనుమతులు, సరైన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని చోట ఇంత భారీ విద్యుత్ సామర్థ్యం (100 కిలో వోల్ట్ ఆంపియర్స్ రెండు ట్రాన్స్‌ఫార్మర్లు) కేటాయించారంటే, క్షేత్రస్థాయి ఏఈ, ఏడీఈ స్థాయి అధికారులు నిబంధనలను ఏ స్థాయిలో ఉల్లంఘించారో స్పష్టమవుతోంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, స్పష్టమైన అక్రమ లాలూచీకి నిదర్శనమని నిపుణులు విమర్శిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలి : ఒకే భవనానికి ఇన్ని సర్వీసులు, ఓసీ లేకుండా 100 కిలో వోల్ట్ ఆంపియర్స్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ప్రతి సర్వీస్‌కు సమర్పించిన దరఖాస్తు పత్రాలు, శాంక్షన్ ప్రొసీడింగ్స్, లోడ్ వివరాలు, కేటగిరీ ఏమిటి? అనే ప్రశ్నలకు నల్లగండ్ల, గచ్చిబౌలి విద్యుత్ అధికారులు సమాధానం తీరాలి. అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ ఉదంతంపై విజిలెన్స్ మరియు డిస్కం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలి. బాధ్యులైన ఏఈ, ఏడీఈ మరియు సబ్ ఇంజనీర్ కిశోర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ సర్వీసులను తక్షణమే తొలగించాలని స్థానికులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News