- తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా, సింగం విజయ్ గౌడ్ రచనలో రూపొందిన పాట విడుదల
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా, సింగం విజయ్ గౌడ్ రచనలో రూపొందిన నూతన గీతాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR Unveils New Song) చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా పాటను విడుదల చేయించారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీలు గోవర్ధన్, అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, తలకొండపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, సర్పంచ్ జల్లెల్ల కృష్ణ, సత్యం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
- Advertisement -
