Homeవరంగల్‌Explosion | కర్రెగుటల్లో పేలిన ప్రెషర్ బాం*బు..

Explosion | కర్రెగుటల్లో పేలిన ప్రెషర్ బాం*బు..

  • వెదురు సేకరణకు వెళ్లిన గిరిజనుండి మృ*తి…
  • జెట్టి కట్టి గుట్టల కిందకు దించిన తోటి గిరిజనులు…

కర్రెగుట్టల్లో(Karreguttalu) మరోసారి బాం*బుల(Explosion) శబ్దం కలకలం సృష్టించింది. గతంలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు(Maoist) అమర్చిన ప్రెషర్ బాం*బు తొక్కి గిరిజనుడు మృ*తి చెందాడు. అటవీ ఉత్పత్తుల సేకరణలో భాగంగా సోమవారం వెంకటాపురం మండలం నూగురు కాలనీకి చెందిన ఆరుగురు గిరిజనులు కర్రగుట్టలకు వెళ్లారు. అటువై ఉత్పత్తుల సేకరణ అనంతరం జెల్ల సమీపంలోకి రాగా అకస్మాత్తుగా మడకం నాగేశ్వరరావు(55) అనే గిరిజనుడు ప్రెజర్ బాం*బు ఉన్న ప్రాంతంలో కాలు వేశాడు.

దీంతో పెద్ద శబ్దం అక్కడ పేలుడు సంభవించింది. మృతుడి కాలు మోకాలికి పై భాగం వరకు ఈ ఘటనలో చిత్రమైంది. అకస్మాతో జరిగిన ఈ సంఘటనతో అతడి సమీపంలోని గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారు. కాసేపటికి చేరుకున్న వారు గాయపడ్డ గిరిజడిని జట్టి కట్టి తీసుకు వస్తున్న క్రమంలో అతడు మృ*తి చెందాడు.

- Advertisement -

రాత్రి సుమారు 9 గంటల ప్రాంతానికి స్వగ్రామానికి గిరిజనులు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ఎస్ ఐ కొప్పుల తిరుపతిరావు గురువారం ఉదయం నూగూరు కాలనీ గ్రామానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. వెంకటాపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News