Homeరంగారెడ్డిTribute | వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

Tribute | వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. బాలాజీ నగర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఉచిత విద్యుత్, 108 అత్యవసర సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి అంకితమైన నాయకుడిగా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు శాంతి కోటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, రాష్ట్ర మహిళా కార్యదర్శి అనంతలక్ష్మి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్‌తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News