Homeరంగారెడ్డిTribute | వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

Tribute | వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

  • కాంగ్రెస్ నాయకులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం అని గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారిసెల సురేందర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 299 గుండ్లపోచంపల్లి డివిజన్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని డివిజన్ అధ్యక్షుడు గారిసెల సురేందర్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గారిసెల సురేందర్ మాట్లాడుతూ పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారి నరేందర్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గువ్వ రవి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ ముదిరాజ్, నాయకులు గడిల కృష్ణారెడ్డి, బట్టి కాడి విజయ్ ముదిరాజ్, రాజేష్, మోహన్, వీరస్వామి, కృష్ణారెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, కావేరి శేఖర్, భూషణం చార, సాయిపేట సురేష్, సాయి, సంతోష్, సంపత్ యాదవ్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News