Homeరంగారెడ్డిProtest | గుండ్ల పోచంపల్లి డివిజన్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా

Protest | గుండ్ల పోచంపల్లి డివిజన్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా

నగరం నిద్ర లెవక ముందే పట్టణాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కరువైందని తమకు ప్రభుత్వం నుండి అందాల్సిన చేతి గ్లౌస్, చీపుర్లు, సబ్బులు తదితర వసతులు గత ఎనిమిది నెలల నుండి అందడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లో బుధవారం ఉదయం కార్మికులు ధర్నాకు దిగారు. కార్మికులకు మేడ్చల్ జిల్లా భాజపా నాయకుడు అమరం మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల నుండి తమకు రోడ్లు ఊడిచేందుకు చీపుర్లు, మురుగు ఎత్తి వేయడానికి గ్లౌస్ లు, సబ్బులు, నూనె, బెల్లం తదితర వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ సైబరాబాద్ కార్పొరేషన్ లో విలీనం జరిగిన వేతనాలు మాత్రం మున్సిపల్ పాలనలో ఇచ్చే వేతనాలు ఇస్తూ దానిలో కూడా పన్నుల పేరుతో నెలకు రూ.500 కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు సరైన వసతులు కల్పించి, కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News