టీజీఈజెఏసీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దుచేసి ఓ పి ఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఫ్లగ్ కార్డులు పట్టుకొని శాంతియుతంగా వాళ్ళ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు టిజీ జిల్లా నాయకులు అంబీర్ మనోహర్ రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం దినంగా పరిగణిస్తూ ఈపీఎస్ రద్దు చేస్తూ ఓ పి ఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు పీఆర్సీలు, ఆరు డీఎలు,పెండింగ్‌లో ఉంచిందని వెంటనే వాటికి సంబంధించిన బకాయిలను విడుదల చేయాలన్నారు. ఓ పిఎస్ ఉద్యోగులకు బిక్ష కాదని, తము చేసిన సేవకు అది ప్రతి ఫలంగా ఇచ్చే హక్కున్నారు.ఈ కార్య క్రమంలో నాయకులు గడ్డం రాజిరెడ్డి, కూచనపల్లి చెన్నారెడ్డి, విక్రాంత్, సౌమ్య, శ్రవణ్, అవినాష్, రాజ్‌కుమార్, రవి తేజ, తదితరులు పాల్గొన్నారు.
